లెదర్‌.. భద్రమిలా!

కాస్త ఉదయాన్నే బయటికి వెళ్లాలంటే మామూలు స్వెటర్లు ఏం సరిపోతాయి? సరిపోయినా... మరి స్టైల్‌ సంగతో? అలాంటప్పుడు అమ్మాయిల ఎంపిక లెదర్‌ జాకెట్లే! ఇక హ్యాండ్‌ బ్యాగుల సంగతి చెప్పనక్కర్లేదు.

Published : 27 Nov 2022 00:06 IST

కాస్త ఉదయాన్నే బయటికి వెళ్లాలంటే మామూలు స్వెటర్లు ఏం సరిపోతాయి? సరిపోయినా... మరి స్టైల్‌ సంగతో? అలాంటప్పుడు అమ్మాయిల ఎంపిక లెదర్‌ జాకెట్లే! ఇక హ్యాండ్‌ బ్యాగుల సంగతి చెప్పనక్కర్లేదు. కానీ వాటిని  జాగ్రత్తగా చూసుకోవాలి!

* నీరు, దుమ్ము.. ఏం పడినా చేత్తో మాత్రం శుభ్రం చేయొద్దు. మృదువైన కుచ్చు ఉన్న బ్రష్‌ లేదా వస్త్రాన్ని ఉపయోగించాలి. లెదర్‌ కోసం ప్రత్యేక క్లీనర్లు వస్తున్నాయి. కానీ వాటితో చేటే అంటున్నారు నిపుణులు. బదులుగా నిమ్మరసాన్ని నీటిలో కలిపి లేదా గాఢత తక్కువున్న సబ్బునీరు, బేకింగ్‌ సోడా, వైట్‌ వెనిగర్‌ కలిపిన నీటిని వస్త్రంపై జల్లి దానితో తుడవాలి. అప్పుడూ కొద్దిగా తడిచేసుకోవాలే గానీ.. నీరు కారుతున్నట్లుగా ఉండకూడదు.

*వాడిన తర్వాత లెదర్‌ వాటిని దాస్తుంటారు. మంచి అలవాటే! అయితే షూ, జాకెట్లు వంటి వాటికి తేమ చేరే ఆస్కారమెక్కువ. దీంతో సూక్ష్మ క్రిములూ వచ్చేస్తాయి. కాబట్టి, పైనే కాదు.. లోపలా శుభ్రం చేయాలి. తేమ లేదనుకున్నాకే దాయాలి. ప్లాస్టిక్‌ కవర్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచొద్దు. నేత సంచులనే ఎంచుకోండి.

* జ్యూస్‌, కూర వంటి మొండి మరకలు పడితే... వెంటనే శుభ్రం చేయాలి. పూర్తిగా ఎండిపోయేవరకూ చూడొద్దు. వెట్‌వైప్‌లతో తుడవాలి. లేదా ఆ మరకపై మొక్కజొన్న పొడి లేదా టాల్కమ్‌ పౌడర్‌ చల్లి కొన్ని గంటలు పక్కన ఉంచాలి. తర్వాత వస్త్రంతో తుడిస్తే సరి. రంగులో మార్పు కనిపిస్తోంటే.. అప్పుడు డిష్‌వాష్‌ కలిపిన నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి.

* రోజులు గడిచే కొద్దీ లెదర్‌ వస్తువుల్లో మెరుపు తగ్గుతుంది. బరకగా మారినట్లు కనిపిస్తాయి. అలా అవ్వకూడదంటే మూడు నెలలకోసారి కొబ్బరి, అవకాడో, జొజొబా నూనెలను కలిపి ఓ వస్త్రంపై స్ప్రే చేసి దాంతో తుడుస్తుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్