ఘాటైన వాసనలా?

ఇంట్లో ఒక్కోసారి ఘాటైన వాసనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అలాంటప్పుడు చిన్న చిన్న చిట్కాలతోనే ఇంటిని పరిమళభరితం చేసుకోవచ్చు అదెలాగంటారా?

Published : 28 Nov 2022 00:05 IST

ఇంట్లో ఒక్కోసారి ఘాటైన వాసనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అలాంటప్పుడు చిన్న చిన్న చిట్కాలతోనే ఇంటిని పరిమళభరితం చేసుకోవచ్చు అదెలాగంటారా?

* దుర్వాసనల్ని అదుపు చేయాలంటే ఒక సీసాలో వైట్‌ వెనిగర్‌ వేసి అందులో కొంచెం రోజ్‌ వాటర్‌ కలిపి గదంతా స్ప్రేచేస్తే సరి. లేదంటే...ఆ ప్రదేశంలో ఓ కప్పులో వంటసోడా వేసి ఉంచండి. ఆ వాసనల్ని పీల్చుకుంటుంది.

* బీరువాల్లో.. ఒక గిన్నెలో నాలుగైదు సుద్దముక్కలు వేసి ఉంచితే అవి తేమను పీల్చుకుని దుస్తులు ముక్కవాసన రాకుండా చూస్తాయి. లేదంటే కాస్త వెనిగర్‌లో లావెండర్‌ నూనె రెండు చుక్కలు కలిపి లోపల కొద్దిగా స్ప్రే చేయండి.

* వంటగదిలో వాసనల్ని పోగొట్టాలంటే రెండు నిమ్మతొక్కలు, ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మరిగిస్తే చాలు...ఆ పరిమళాలు ఇల్లంతా వ్యాపిస్తాయి. మనసు హాయిగా ఉంటుంది.

* ప్లాస్టిక్‌ పాత్రలు పదార్థాల వాసనని ఇట్టే పట్టేస్తాయి. రెండో సారి ఉపయోగించాలంటే ఆ వాసన ఇబ్బందిపెడుతుంది. అందుకే ప్లాస్టిక్‌ పాత్రని వాడిన తర్వాత అందులో ఒక కాగితాన్ని నలిపేసి వేస్తే అది వాసన పీల్చుకుని తిరిగి వాడుకోవడానికి అనువుగా మారుతుంది.

* బ్యాగులు కొన్నప్పుడు ఇచ్చే సిలికాజెల్‌ ప్యాకెట్లను పడేయకండి. వాటిని దుస్తుల అల్మారాలో ఉంచుకుంటే... తేమను పీల్చుకుంటాయి. దుర్వాసన రాకుండా అడ్డుకుంటాయి.

* షూస్‌ని అరల్లో దాచిపెట్టేటప్పుడు కాగితాలని ఉండల్లా చుట్టి.. వాటిల్లో ఉంచితే చెడు వాసన రాకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్