తులసి మొక్క గుబురుగా..

ఇంటి ముందు కళకళలాడే  తులసి కొన్ని సార్లు వడలిపోయినట్లు కనిపిస్తుంటుంది. వెంటనే పాతది పీకేసి కొత్త మొక్కను నాటుతుంటారు.

Updated : 29 Nov 2022 05:03 IST

ఇంటి ముందు కళకళలాడే  తులసి కొన్ని సార్లు వడలిపోయినట్లు కనిపిస్తుంటుంది. వెంటనే పాతది పీకేసి కొత్త మొక్కను నాటుతుంటారు. ఉన్న మొక్కనే గుబురుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేయొచ్చు అంటున్నారు నిపుణులు.

ఏపుగా పెరిగాక ఎండిన కొమ్మలను విడదీయాలి. పొడవుగా పెరిగిన కొమ్మల చివర్లనూ తొలగించాలి. మొదళ్లలో మట్టిని తిరగేసి, నాలుగైదు ఎండిన ఆవు పేడ పెళ్లలు, గుప్పెడు ఎర్రమట్టి, కొంచెం వేప పొడి వేయాలి. కొత్తగా వేసిన ఈ మట్టి మిశ్రమాన్ని తడపాలి. తగినన్ని నీళ్లు పోసి మొక్కను ఎండపడేలా ఉంచాలి. నెల రోజుల్లోపు ఎండిన కొమ్మలు తీసిన చోట తిరిగి చిగురించడం మొదలుపెడుతుంది.

కొత్తగా.. తీసిన కొమ్మలను ఒకచోట మట్టిలో వేస్తే వాటి విత్తనాలతో కొత్తమొక్కలు మొలుస్తాయి. వీటిని మరొక తొట్టెలో నాటుకుంటే వచ్చే తులసీదళాలను పూజకు వాడుకోవచ్చు. తొట్టెలో నల్లమట్టి, ఎర్రమట్టి, వర్మికంపోస్ట్‌, వేపపొడిని కలిపిన మిశ్రమాన్ని మూడొంతులు నింపాలి. చిన్నచిన్న మొక్కలను అయిదింటిని తీసుకొని తొట్టె మధ్య, నాలుగు వైపులా వచ్చేలా నాటాలి. రోజూ మొదళ్లను తడిపితే చాలు. నీటిని తగినంతగా ఇస్తుంటే నెలలోపు చిగుళ్లు తొడిగి, తొట్టె అంతా తులసి మొక్కలతో నిండి పోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్