పుల్లల నడుమ పూల గుత్తులు..

పాలపొడి డబ్బా,  ఖాళీ గాజు సీసాలు వంటివి ఇంట్లో వృథాగా ఉంటే వాటిని అందమైన గృహోపలంకరణలుగా మార్చుకోవచ్చు.  కళాత్మకంగా తీర్చిదిద్ది భోజనబల్లకు కొత్తందనాన్ని తీసుకురావొచ్చు.

Updated : 14 Dec 2022 10:56 IST

పాలపొడి డబ్బా,  ఖాళీ గాజు సీసాలు వంటివి ఇంట్లో వృథాగా ఉంటే వాటిని అందమైన గృహోపలంకరణలుగా మార్చుకోవచ్చు. కళాత్మకంగా తీర్చిదిద్ది భోజనబల్లకు కొత్తందనాన్ని తీసుకురావొచ్చు.

ఎండిన పుల్లలు లేదా వెదురు బద్దలు సేకరించాలి. జిగురు, పురికొస, రంగురంగుల రిబ్బన్లు సిద్ధం చేసుకోవాలి. ఖాళీ సీసాకు బయటివైపు జిగురురాసి, వరుసగా పుల్లలను అంటించి ఆరనివ్వాలి. ఇప్పుడీ సీసాలో మనీప్లాంట్‌ లేదా ఏదైనా ఇండోర్‌ మొక్కనుంచి సరిపడా నీరు నింపితే చాలు. గది కిటికీలో ఉంచితే పుల్లలమధ్య మొక్క పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేదనుకోండి.. రంగురంగుల కాగితాలు, వస్త్రాలతో పూల గుత్తులను సిద్ధం చేసి సర్దితే చూడటానికి ఫ్లవర్‌వాజ్‌లా మారిపోతుంది. దీన్ని టీపాయి లేదా భోజనబల్ల మధ్యలో ఉంచితే కొత్తగా కనిపిస్తుంది.

విరబూసినట్లు.. చామంతి, బంతి పూలు విరబూసిన చిన్న తొట్టెకు చుట్టూ కట్టడానికి సరిపడా పుల్లలను ముందుగా తీసుకోవాలి. ఇవన్నీ సమానంగా ఉండేలా కట్‌ చేసి పురికోసతో మాలగా కట్టాలి. ఈ మాలను పూలతొట్టె కనబడకుండా చుట్టూ వచ్చేలా తాడు లేదా రిబ్బన్‌తో కడితే చాలు. గది కిటికీలో వెలుతురుపడే చోట దీన్నుంచితే తొట్టె కనబడకుండా పుల్లల మధ్య పూలు పూసినట్లుగా అనిపిస్తుంది. గదికే అందాన్నిస్తుంది. చిన్న ఫ్లవర్‌వాజ్‌ను పెద్ద, చిన్న పుల్లలతో కలిపి కవర్‌చేస్తూ అంటించాలి. ఇందులో సర్దడానికి ముదురు వర్ణం పూలనెంచుకోవాలి. ఈ వాజ్‌ను టీపాయిపై ఉంచితే ఆ ప్రాంతానికంతా కళను తెచ్చిపెడుతుంది. పుల్లలకు సగం వరకు ఏదైనా లేతవర్ణం పెయింట్‌ వేసి ఆరనిచ్చిన తర్వాత వాటిని ఫ్లవర్‌వాజ్‌కు చుట్టూతా సర్ది తాడుతో ముడివేయాలి. ఇందులో అదే వర్ణం పూలను సర్ది గది మూల బల్లపై ఉంచితే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్