అల్లికతో రంగుల కలబోత..

వర్ణభరితంగా పూసే మాస్‌ రోజెస్‌ మొక్కలను జడలా అల్లి పెంచితే చాలు.

Published : 02 Dec 2022 00:37 IST

వర్ణభరితంగా పూసే మాస్‌ రోజెస్‌ మొక్కలను జడలా అల్లి పెంచితే చాలు. విరిసిన పూలన్నీ రంగుల కలబోతగా మారి ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

ఇంట్లో వృథాగా ఉండే పెద్ద ప్లాస్టిక్‌ సీసాలను రెండు భాగాలుగా కత్తిరించాలి. ముందుగా కిందిభాగాన్ని బోర్లించి దానిపై పైభాగాన్ని గమ్‌తో అతికించాలి. వీటికి ముదురు, లేత వర్ణాల పెయింట్‌ వేసి, ఆరనిస్తే రంగురంగుల తొట్టెలుగా మారతాయి. నిండా మట్టి నింపాలి. ఆరేడు రంగుల పూలు పూసే మాస్‌ రోజ్‌ మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. వీటి కొమ్మలను విడిగా తీసి, సమాన పొడవుండేలా కట్‌ చేయాలి. వీటికి చివరి భాగంలో మాత్రమే ఆకులుండేలా చూసి, మిగతా ఆకులను తీసేయాలి. ఆ కొమ్మలన్నింటినీ జడలా అల్లి చివర్లో ఆకులుండేచోట రబ్బరు బ్యాండ్‌తో ముడి వేయాలి. కుచ్చుగా అనిపించే అయిదారు మొక్కల కాండాల జడను సిద్ధంగా ఉంచుకొన్న సీసా తొట్టెల్లో నాటి నీటితో తడపాలి. రెండు వారాల్లోపు ఈ కొమ్మలన్నీ చిగురించి మొగ్గ తొడిగి పూలు పూయడం ప్రారంభిస్తాయి.  వీటిని టీపాయి, భోజనాల బల్లపై ఉంచితే గదికే కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి.

చూడముచ్చటగా..

సాధారణ తొట్టెకు రంగులు లేదా డిజైన్‌ వేసి ఆరబెట్టి మట్టితో నింపాలి. వీటిలో పైన చెప్పినట్లుగా ఆరేడు రంగుల మాస్‌రోజ్ కొమ్మలను తీసుకొని జడలా అల్లాలి. ఇలా మొత్తం 20 కొమ్మలుండేలా లావుగా జడ తయారు చేసి రబ్బరు బ్యాండ్‌తో ముడివేసి తొట్టెలో నాటితే చాలు. నెల తిరిగేలోపు విరబూస్తాయి. పాత గాజుల స్టాండులో ప్రతి కర్రకూ మట్టి నింపిన చిన్న ప్లాస్టిక్‌ సంచి కట్టాలి. ఈ సంచులన్నింటికీ రంధ్రాలు చేసి వాటిలో రంగులన్నీ కలిపిన నాచుమొక్కల కొమ్మలను గుచ్చి రోజూ తడపాలి. ఇవన్నీ చిగురించి గాజుల స్టాండు పూలస్టాండులా మారిపోతుంది. అలాగే క్రోటన్‌ మొక్కలు వేలాడే దీసే తొట్టెల్లోనూ జడలల్లిన నాచు మొక్కలను ఉంచి కిందకు జారుతున్నట్లుగా వదిలేయాలి. ఆ తొట్టెలపై అమ్మాయి ముఖంలా డిజైన్‌ చేస్తే.. కొద్ది రోజులకు పూల కొమ్మలు జడల్లా కనిపిస్తూ కనువిందు చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్