మొక్కలతో... సానుకూలత

స్వచ్ఛమైన గాలి.. ఇంటికి అందాన్నివ్వడం.. కాలక్షేపం.. కారణమేదైతేనేం మొక్కల పెంపకం చాలా ఇళ్లల్లో సాధారణమై పోయింది.

Published : 04 Dec 2022 00:03 IST

స్వచ్ఛమైన గాలి.. ఇంటికి అందాన్నివ్వడం.. కాలక్షేపం.. కారణమేదైతేనేం మొక్కల పెంపకం చాలా ఇళ్లల్లో సాధారణమై పోయింది. ఒత్తిడి దూరం కావాలి, సానుకూలత పెరగాలి అనుకుంటున్నారా.. అందుకూ వీటినే ఎంచుకోమంటున్నారు నిపుణులు. కొన్ని మొక్కలు అందుకు నిజంగానే సాయపడతాయట! అవేంటంటే..

* దేవగన్నేరు... బాల్కనీ, ఇంటి ముందు.. ఎక్కడుంచినా ఇంటికి ప్రత్యేక అందాన్ని తెస్తుంది. రోజూ కొద్దిగంటలు ఎండ తగిలేలా చూసుకోవడం మాత్రం తప్పని సరి. తెలుపు, గులాబి.. ఇంకా భిన్న రంగుల్లో పూసే ఈ పూల నుంచి తీసిన నూనెను పెర్‌ఫ్యూమ్‌లు, ఔషధాల తయారీలోనూ వాడతారు. పూల సహజ సువాసనలు తలనొప్పిని తగ్గించి.. మనసుకు విశ్రాంతిని కలగజేస్తాయి. వాస్తు శాస్త్రం.. ఈ మొక్క ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీని తీసుకొస్తుందని చెబుతోంది.

* మనీప్లాంట్‌.. ఆక్సిజన్‌ను ఎక్కువ విడుదల చేస్తుంది. గాలిలో కలుషితాలు.. బెంజీన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటివి  దూరం చేస్తుంది. అంతే కాదు.. ఎలక్ట్రానిక్‌ పరికరాల రేడియేషన్‌నూ తగ్గించగలదట. కాస్త ఆందోళనగా ఉన్నా.. ఒత్తిడి అనిపించినా దాని దగ్గర కూర్చోండి. వాటిని తరిమేస్తుంది. ఎక్కువ నిర్వహణ అవసరం ఉండదు. నీరు, మట్టి రెండిట్లోనూ పెరుగుతుంది. రోజూ కాసేపు ఎండలో ఉంచితే సరి. చేపల తొట్టెలోనూ పెంచొచ్చు. దాన్నీ శుభ్రంగా ఉంచడం ఈ మొక్క ప్రత్యేకత.

* తులసి.. దేవతా ప్రతిరూపంగా కొలిచే ఈ మొక్క దాదాపుగా ప్రతి తెలుగు ఇంట్లోనూ ఉంటుంది. దీనిలో ఒత్తిడిని దూరం చేసే గుణాలెక్కువ.. అందుకే పూజ కోసం కాకపోయినా ఇంట్లో తప్పక ఉంచుకోమంటారు. రోజూ కొన్ని ఆకుల్ని తింటే.. చర్మ, కేశ సమస్యలు దూరమవ్వడమే కాదు. రోగనిరోధకత పెరిగి జబ్బులూ దరిచేరవు.

* మల్లె.. దీనిలో ఏ రకాన్ని ఇంటిలో పెంచుకున్నా మంచిదే! ఈ పూల సువాసనలు మనసుకి విశ్రాంతినిస్తాయి. నిమిషాల్లో మూడ్‌ను మార్చేస్తాయి. దీనికి సహజ ప్యూరిఫయర్‌ అన్న పేరు. గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. అందం, ఆరోగ్యం పెంచడంలోనూ దీనిది ప్రధాన పాత్రే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్