తేలిగ్గా.. తాగేయొచ్చు!

కొబ్బరినీళ్లలో ఖనిజాలూ పోషకాలు విస్తారంగా ఉంటాయి కనుక చిన్నాపెద్దా అందరం తాగుతుంటాం. అమ్మేవాళ్లు తమ దగ్గరుండే పెద్ద కత్తితో కొబ్బరిబొండాం సునాయాసంగానే కొట్టిస్తారు. కానీ మనం చెక్కు తీయాలంటే మాత్రం చాలా కష్టం.

Updated : 05 Dec 2022 03:57 IST

కొబ్బరినీళ్లలో ఖనిజాలూ పోషకాలు విస్తారంగా ఉంటాయి కనుక చిన్నాపెద్దా అందరం తాగుతుంటాం. అమ్మేవాళ్లు తమ దగ్గరుండే పెద్ద కత్తితో కొబ్బరిబొండాం సునాయాసంగానే కొట్టిస్తారు. కానీ మనం చెక్కు తీయాలంటే మాత్రం చాలా కష్టం. నానా ప్రయాసా పడటం సంగతలా ఉంచి వేలు తెగుతుందని భయమేస్తుంది. ఈ గోలంతా లేకుండా కోకోనట్‌ ఓపెనర్‌ ఒకటి కొనుక్కుంటే సరి.. క్షణాల్లో పనైపోతుంది. చిన్న వాకింగ్‌ స్టిక్‌ని తలపించే ఈ పరికరం కొబ్బరిబొండాంని తేలిగ్గా డ్రిల్‌ చేస్తుంది. గ్లాసులోకి వంపి లేదా స్ట్రా వేసుకుని తాగడమే తరువాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్