స్తంభంతో శోభ

మన ఇళ్లల్లో ఎక్కువ శాతం స్తంభాలు గోడల్లో కలిసి పోతాయి. కానీ ఒక్కోసారి పిల్లర్లు విడిగా కనిపిస్తుంటాయి.

Published : 07 Dec 2022 00:42 IST

మన ఇళ్లల్లో ఎక్కువ శాతం స్తంభాలు గోడల్లో కలిసి పోతాయి. కానీ ఒక్కోసారి పిల్లర్లు విడిగా కనిపిస్తుంటాయి. అవి ఇంటి శోభను తగ్గిస్తున్నాయని బాధపడే బదులు వాటిమీద రంగులతో బొమ్మలు వేసి అలంకరించుకోమంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. కుటుంబసభ్యుల్లో కాస్తంత కళానైపుణ్యం ఉన్నవాళ్లు ఆ పనికి పూనుకోవచ్చు. లేదంటే ఆ నైపుణ్యం ఉన్న కళాకారులతో తైలవర్ణాల డిజైన్లు వేయించుకుంటే సరి. ఇదీ కాదంటే ఇప్పుడు చాలా చక్కని వాల్‌ పేపర్లు ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి. ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్