బాల్కనీలో తమలపాకు..

జీర్ణశక్తిని మెరుగుపరిచే ఔషధగుణాలున్న తమలపాకును పెరట్లో లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. తగు జాగ్రత్తలు పాటిస్తే పచ్చని తమలపాకు మీకెదురుగా ఉంటుంది.

Updated : 14 Dec 2022 04:33 IST

జీర్ణశక్తిని మెరుగుపరిచే ఔషధగుణాలున్న తమలపాకును పెరట్లో లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. తగు జాగ్రత్తలు పాటిస్తే పచ్చని తమలపాకు మీకెదురుగా ఉంటుంది.

తమలపాకు మొక్కను పెంచుకోవడానికి పెరట్లో చోటులేనప్పుడు బాల్కనీలో తొట్టెలో నాటొచ్చు. రోజంతా ఎండ పడే ప్రాంతంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం రెండుగంటలపాటు నీరెండ పడేలా ఉంటే ఈ మొక్క ఏపుగా ఎదుగుతుంది. తీవ్రమైన ఎండ వేడిని, పొడి వాతావరణాన్ని ఇది తట్టుకోలేదు. దీనికి పెద్ద తొట్టెను ఎంచుకోవాలి. లేదంటే గుబురుగా పెరిగేటప్పుడు తొట్టె ఇరుకు అవుతుంది. మట్టిని ఎంచుకొనేటప్పుడు కోకోపీట్‌, సేంద్రియ ఎరువులు కలిసి ఉండేలా చూడాలి. మట్టి గుల్లగా, తొట్టెలో తేమ దూరం కాకుండా జాగ్రత్తపడాలి. రోజూ నీటిని అందించాలి. అలాగని నీరు ఎక్కువగా నిల్వ ఉండ కూడదు. లేదంటే ఫంగస్‌ చేరే ప్రమాదం ఉంది. తొట్టె అడుగున రెండు మూడు రంధ్రాలు చేస్తే, అదనపు నీరు బయటకు పోతుంటుంది. తొట్టె మధ్యలో మొక్క పాకడానికి వీలుగా మాస్‌స్టిక్‌ తప్పనిసరి. నాటిన మూడునాలుగు వారాల్లో కొత్తచిగుర్లతో నవనవలాడుతూ గుబురుగా ఎదగడం ప్రారంభమవుతుంది. హైడ్రోజన్‌ ఎక్కువ శాతం ఉండే ఎరువు ఈ మొక్కకు అవసరం. రసాయన ఎరువుల జోలికి వెళ్లకపోవడం మంచిది. మూడు నెలలకొకసారి ఆవుపేడ, ఆకులు వంటి వాటితో తయారుచేసే సేంద్రియ ఎరువులను అందించాలి. ఆకులపై చేరే చీడపురుగుల బెడద నివారణకు, ఎక్కువ నీటిలో తక్కువ సబ్బునీరు, వేపనూనె కలిపి ఆ మిశ్రమాన్ని చల్లితే చాలు. ఆకులు చెదపట్టినట్లు మారితే, వాటిని గిల్లేసి దూరంగా పడేయాలి.

అంటు కట్టొచ్చు..

మొక్క నుంచి చిగుర్లున్న కొమ్మను కత్తిరించి విడిగా తీయాలి. చిగుర్లను మాత్రం ఉంచి, మిగతా ఆకులను తీసేసి నీటిని నింపిన గాజు గ్లాసులో ఉంచితే వారంలో కొమ్మకు వేర్లు మొదలవుతాయి. దీన్ని విడిగా తొట్టెలో ఉంచితే చాలు. అలాగే వేర్లున్న కణుపుల వద్ద ఒక కొమ్మను కత్తిరించాలి. భూమిలో వేర్లు ఉండేలా కొమ్మను వాలుగా పాతి, నీటిని అందిస్తే చాలు. మూడు నాలుగు వారాల్లో చిగురిస్తుంది. దీన్ని తీసి తొట్టెలో నాటుకోవచ్చు. మొక్క పొడవుగా పెరుగుతున్నప్పుడు చివర్లు కత్తిరించి వాటిని వేరే చోట నాటుతుంటే, మొక్క అడుగుభాగాన కొత్త ఆకులు చిగురిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్