అనాసక్తి పోవాలా.. అలంకరించేయండి!

పని మొదలుపెట్టాలి అనిపించడం లేదు.. విసుగ్గా ఉంది.. ఉద్యోగ విషయంలో ఇలాంటి భావనలొస్తున్నాయా? ఎంతసేపూ కంప్యూటర్‌, ఆ నాలుగు గోడలనీ చూస్తూ కూర్చొంటే  అనాసక్తి కాక ఏం కలుగుతుంది? అందుకే కాస్త సృజనాత్మకతకు పని చెప్పేయండి.

Updated : 15 Dec 2022 02:53 IST

పని మొదలుపెట్టాలి అనిపించడం లేదు.. విసుగ్గా ఉంది.. ఉద్యోగ విషయంలో ఇలాంటి భావనలొస్తున్నాయా? ఎంతసేపూ కంప్యూటర్‌, ఆ నాలుగు గోడలనీ చూస్తూ కూర్చొంటే  అనాసక్తి కాక ఏం కలుగుతుంది? అందుకే కాస్త సృజనాత్మకతకు పని చెప్పేయండి.. పని ప్రదేశమూ ఉత్సాహం కలిగించడం ఖాయం.

* డెస్క్‌ దగ్గర మొక్కను చేర్చేయండి. పూలతో ఉంటే ఇంకా మంచిది. కుండీ కూడా పెయింటింగ్‌తో ఉండేలా చూసుకోండి. కొత్త అందమే కాదు.. మనసుకీ ప్రశాంతత. ఎండ లేకపోయినా బతకగలిగే, తక్కువ నిర్వహణ అవసరమైన మొక్కలను ఎంచుకోవాలి. లేదంటే.. అదనపు శ్రమ అవుతుంది.

* నచ్చిన వాళ్లు తోడుంటే నరకమైనా సౌకర్యంగానే ఉంటుంది కదూ! అందుకే మీరు ప్రేమించే వాళ్ల ఫొటోలకు సిస్టమ్‌ పక్కన చోటివ్వండి. చూడగానే మూడ్‌ మారిపోయే వాటికీ చోటివ్వొచ్చు. అలా అని ఫ్రేములతో నింపేయకండి. గజిబిజిగా కనిపిస్తే తర్వాత మీకే చిరాకు. చిన్న చిన్న ఫొటోలను, అంటించుకునే వీలున్నవైతే మంచిది.

* ఒక్కోసారి గడువు ముంచుకొస్తున్నా పని మాత్రం కదలదు. దీంతో ఒత్తిడి. మీకు నచ్చే, ముందుకు నడిపించే చిన్న చిన్న కోట్‌లను కళ్ల ముందు ఉంచుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

* సీరియస్‌గా అనిపిస్తుంది కాబట్టే.. పని ప్రదేశమంటే కష్టమన్న భావన కలుగుతుంది. వాటర్‌ బాటిల్‌, కాఫీకప్‌.. పూలతో, కార్టూన్లతో ఉన్నవి ఎంచుకోండి. చిన్నతనంలోకి వెళ్లొచ్చు. క్యూట్‌ బొమ్మల క్యాలెండర్‌ని తెచ్చుకున్నా ఆహ్లాదంగా ఉంటుంది.

* పెన్నులు, పేపర్లు, క్లిప్‌లు.. ఎన్ని అవసరం? ప్రతిదానికీ వెతుక్కోవడం చిరాకు. ఆర్గనైజర్లను తెచ్చిపెట్టుకోండి. వాటిలో సక్రమంగా సర్దుకుంటే చూడటానికీ బాగుంటుంది, మనసుకీ ప్రశాంతత.

* మరచిపోవడం ఒత్తిడికి ప్రధాన కారణం. గుర్తుంచుకోవడానికి స్టిక్‌ నోట్‌లను తెచ్చుకోండి. ఆ మర్చిపోం అనుకోక ప్రతిదీ రాసి సిస్టమ్‌కి పెట్టుకోండి. వాటినీ కాస్త భిన్న రంగులు, పూలతో ఉన్నవి ఎంచుకుంటే చేసే పని మీదా ప్రేమ పుడుతుంది. అన్నీ చిన్న మార్పులే.. పాటించి చూడండి. ఉత్సాహం ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్