సహజంగా తరిమేద్దాం!

మొక్కలపై ఎంత శ్రద్ధ చూపినా సరే... పురుగు, పుట్రా చేరుతూనే ఉంటాయి. వాటిని సహజ పద్ధతుల్లో దూరం చేయడానికి ఈ చిట్కాలు పని చేస్తాయి.

Updated : 17 Dec 2022 01:23 IST

మొక్కలపై ఎంత శ్రద్ధ చూపినా సరే... పురుగు, పుట్రా చేరుతూనే ఉంటాయి. వాటిని సహజ పద్ధతుల్లో దూరం చేయడానికి ఈ చిట్కాలు పని చేస్తాయి.

* పావుకప్పు మౌత్‌వాష్‌కి, పావుకప్పు నీళ్లు, కొద్దిగా... బేకింగ్‌ సోడా కలిపి ఆకులపై స్ప్రే చేయండి. ఆకుపై చేరిన నల్లటి పురుగులు దూరమవుతాయి.

* మూడొంతుల బొరాక్స్‌ పొడికి, ఒక వంతు పంచదారని కలిపి మొక్క చుట్టూ ఉండే మట్టిలో కొద్దిగా చల్లితే... చీమలు పట్టవు.

* వేపనూనె లేదా ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌ని విడివిడిగా తీసుకుని కావాల్సినన్ని నీళ్లు కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకుని పురుగులు ఉండే చోట చల్లితే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్