Updated : 26/12/2022 06:41 IST

ఎండుకొమ్మలూ... అతికించే అద్దాలే అందం!

చిన్న ఇల్లైనా సరే... చక్కగా సర్దుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం కాస్త సమయం, శ్రద్ధ పెడితే చాలు... పెద్దగా ఖర్చు అవసరం లేకుండానే కళకళలాడేలా చేయొచ్చు.

*  హాల్లోకి అడుగుపెట్టగానే...ఆహ్లాదంగా అనిపించాలి. అందుకే వీలైనంత తక్కువ ఫర్నిచర్‌ ఉండేలా చూసుకోండి. గోడలకు కనిపించినవన్నీ వేలాడదీయొద్దు. అలాగని ప్లెయిన్‌గా ఉంటే....ఇలా చేయండి. ఓ చిన్న హోల్డర్‌ అతికించండి. ఇప్పుడు బలంగా ఉండే ఓ ఎండు కొమ్మని తీసుకుని దాన్ని నచ్చిన రంగుతో పెయింట్‌ చేయండి. దీనికి ఊలు దారంతో పామ్‌ పామ్‌ బాల్స్‌, టాసిల్స్‌ వంటివి తీరైన ఆకృతిలో వేలాడదీసి దాన్ని గోడకి హ్యాంగ్‌ చేస్తే చాలు. గదికే అందం వస్తుంది.

* ఫొటోలంటే ఎవరికి ఇష్టం ఉండదు....మీకూ ఆ ఆసక్తి ఉంటే ఒకే ఆకృతిలో ఉండే ఆరేడు ఫ్రేమ్స్‌ని ఎంచుకోండి. ఇందులో పిల్లలవో, మీవో...వయసుల వారీగా పెట్టేసి...గోడకు తగిలిస్తే సరి.

* చూడచక్కని ప్రకృతి అందాలూ, ప్రపంచ అద్భుతాలు ఇప్పుడు వినైల్‌ స్టిక్కర్ల రూపంలో దొరుకుతున్నాయి. మీకు నచ్చేదాన్ని ఒకదాన్ని హాలు గోడపై అంటించేస్తే సరి. చూడగానే కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.

* ఇప్పుడు ఇంటీరియర్‌లో అద్దాలదే హవా. ఇవి స్టిక్కర్ల రూపంలో దొరుకుతున్నాయి. వీటిని ఓ ఆకృతి ప్రకారం సర్దేస్తే... ఇంటికి కొత్త కళ వచ్చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని