తోరణాలతో కళకళ!

బంధువుల రాకతో.. ఇంటిల్లిపాదీలో సంతోషాలు నిండి సగం పండగ కళ వచ్చేస్తుంది. మరి తక్కిన సగం కళని తీసుకురావాలంటే.. ఇంటికొచ్చే బంధువులకైనా, మనకైనా ఆహ్లాదం కలిగించేవి పచ్చని తోరణాలే కదా!

Updated : 14 Jan 2023 06:04 IST

బంధువుల రాకతో.. ఇంటిల్లిపాదీలో సంతోషాలు నిండి సగం పండగ కళ వచ్చేస్తుంది. మరి తక్కిన సగం కళని తీసుకురావాలంటే.. ఇంటికొచ్చే బంధువులకైనా, మనకైనా ఆహ్లాదం కలిగించేవి పచ్చని తోరణాలే కదా!

* బంతిపూలు ఒకే రంగువి కాకుండా.. లేత, ముదురురంగుల్లో సగం సగం తీసుకోండి. రంగుని మార్చిమార్చి తోరణాలు కట్టండి. మధ్యలో ఆట విడుపుగా ఒక మామిడాకుని వేయండి. ఆహ్లాదంగానూ, కొత్తగానూ కనిపిస్తాయి. వీలైతే చివర ప్లాస్టిక్‌ గంటలు లేదా లోహపు గంటలు విడిగా దొరుకుతున్నాయి... అవి కట్టి చూడండి. తోరణాలు భలే ముద్దొస్తాయి.

* నగరాల్లో మామిడాకులు పెద్దగా దొరకవు కదా! దొరికిన కొన్నింటితో అందంగా మెరిపించాలంటే... పురికొసకి ఒక్కో ఆకుని పిన్‌ కొట్టేయండి. ఒక్కో ఆకుపైన టేప్‌తో గులాబీలను కానీ, బంతిపూలని కానీ అతికించేయండి. పూల తోరణాలు సిద్ధం.

* రజనీగంధ అవేనండీ.. లిల్లీ పూల తోరణాలు మళ్లీ కొత్తగా అలరిస్తున్నాయి. లిల్లీలని నిలువుగా గుచ్చి, చివర బంతిపూలనో, చిన్నపాటి గులాబీలనో గుప్పించండి. భలేగా ఉంటాయీ తోరణాలు. ఇక అడ్డంగా లిల్లీపూల మాలకి ఎర్ర కలువలని కూడా జోడించండి. పండగ కళ మొత్తం ఇంటి ముంగిట్లో ముగ్గేసుకుని కూర్చోకపోతే అడగండి.

* కలువపూల హ్యాంగింగ్‌లు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. వాటి చివర బంతిపూలని జోడిస్తే ముచ్చటగా ఉంటాయి. పండగ కళ ఇట్టే వచ్చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్