తీపి తిను... తియ్యగా మాట్లాడు!

సంక్రాంతి వస్తుందంటే ఓ నెల రోజుల ముందే పల్లెల్లో హడావుడి మొదలయ్యేది. వారం ముందు నుంచే.. అరిసెలు, పాకుండలు, జంతికలు వండే వారు. ఈ పండగని మనమే కాదు... దేశవ్యాప్తంగా అందరూ చేసుకొంటారు.

Published : 15 Jan 2023 00:44 IST

సంక్రాంతి వస్తుందంటే ఓ నెల రోజుల ముందే పల్లెల్లో హడావుడి మొదలయ్యేది. వారం ముందు నుంచే.. అరిసెలు, పాకుండలు, జంతికలు వండే వారు. ఈ పండగని మనమే కాదు... దేశవ్యాప్తంగా అందరూ చేసుకొంటారు. మరి వాళ్లేం వండుకుంటారో తెలుసుకుందామా?

మహారాష్ట్రలో: నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు ఒకరికొకరు తినిపించుకుంటారు. తీపి తిను.. తియ్యగా మాట్లాడు అని శుభాకాంక్షలు చెప్పుకొంటారు.

అసోంలో: బియ్యప్పిండితో అట్లు పోసి అందులో బెల్లం, వేయించిన నల్ల నువ్వులని ఉంచిన తిల్‌పిటాలు తయారుచేస్తారు. ఇక కొబ్బరి లడ్లు, మరమరాల లడ్లు కూడా ఈ పండగ ప్రత్యేకమే.

గుజరాత్‌లో: ఈ పండక్కి ‘ఉందియు’ అనే వంటకాన్ని ప్రత్యేకంగా చేస్తారు. ఈకాలంలో దొరికే బీన్స్‌, వంకాయలు, చిలగడదుంపలు, ఆలుగడ్డలు ఇలా అన్ని రకాల కాయగూరల్నీ కొత్త మట్టి కుండలో వండుతారు. ఈ కూరని పూరీతో కలిపి తింటారు. మినప్పిండి, సెనగపిండి కలిపి చోలాఫలీ అనే చిప్స్‌ని కూడా ఇష్టంగా చేసుకుంటారు.

బిహార్‌లో: ఈ పండక్కి మరమరాలు, బెల్లంతో చేసిన లడ్డూలు, చిక్కీలు చేసుకుంటారు. వీటిని లాయ్‌ పట్టీలంటారు. పల్లీపట్టీలు కూడా ఇష్టంగా తింటారు.

బంగాల్‌లో: ఈత బెల్లంతో పాయసాన్ని ప్రత్యేకంగా చేసుకుంటారు. దీనిని నోలెన్‌ గుర్‌ పాయస్‌ అంటారు. చిక్కని పాలు... బెల్లం కలిసిన రుచితో నోలెన్‌ గుర్‌ పాయస్‌ అద్భుతంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్