మొక్కలకు వంటింటి బంగారం

పెరటి మొక్కలకు పోషకాలు అందించే వంటింటి వ్యర్థాలను బంగారంతో పోలుస్తారు నిపుణులు. వీటిని తగిన రీతిలో నిల్వచేసి ఎరువులా మార్చగలిగితే సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకానికి ఎంచక్కా వినియోగించొచ్చు. వ్యర్థాలు మట్టిని పోషక భరితంగా మారుస్తాయి. వీటిలోనూ రెండు రకాలుంటాయి.

Published : 17 Jan 2023 00:08 IST

పెరటి మొక్కలకు పోషకాలు అందించే వంటింటి వ్యర్థాలను బంగారంతో పోలుస్తారు నిపుణులు. వీటిని తగిన రీతిలో నిల్వచేసి ఎరువులా మార్చగలిగితే సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకానికి ఎంచక్కా వినియోగించొచ్చు.

వ్యర్థాలు మట్టిని పోషక భరితంగా మారుస్తాయి. వీటిలోనూ రెండు రకాలుంటాయి. రంపపు పొడి, రాలిన ఆకులు, కొమ్మలు, బూడిద బ్రౌన్‌ వేస్ట్‌కాగా, గడ్డి మొక్కలు, పండ్ల తొక్కలు, కాఫీ పొడి, కూరగాయల వ్యర్థాలు వంటివి గ్రీన్‌ వేస్ట్‌. ఈ రెండు రకాల వ్యర్థాలను నీరు, పేడ, మట్టితో కలిపి సరైన రీతిలో నిల్వ చేస్తే వీటిలోని బ్యాక్టీరియా, ఫంగై, మైక్రో ఆర్గానిజమ్స్‌ వంటి వన్నీ కలిసి సేంద్రియ ఎరువును తయారు చేస్తాయి. గింజల తొక్కలు, కూరగాయల తొక్కలు, టీబ్యాగులు, ఆకులు, కాగితాలు లేదా కార్డ్‌బోర్డు, చనిపోయిన మొక్కల వ్యర్థాలు, మిగిలిన ఆహారాన్ని మాత్రమే ఎరువు తయారీకి ఉపయోగించాలి. అలాకాక మిగిలిన మాంసాహారం, చేపముళ్లు, పాల ఉత్పత్తులు, నూనెలు వంటివి వేస్తే మొక్కలకు హాని చేస్తాయి.

రెండు రకాలుగా..

ముందుగా తడి, పొడిని వేరుచేయాలి. కూరగాయలు, పండ్ల తొక్కలు, కోడిగుడ్లు పెంకులు, మిగిలిన ఆహారం, వడలిన పువ్వులు వంటివన్నీ తడిచెత్త. రాలి ఎండిన ఆకులు, పాత కాగితాలు, కొమ్మలు, ఎండిన మొక్కలు, బూడిద, కోకోపీట్‌ వంటివన్నీ పొడి చెత్త. ఎరువు తయారీకి ఇండోర్‌ లేదా పెరట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోండి. ఇండోర్‌ అయితే మట్టి లేదా ప్లాస్టిక్‌ తొట్టె తీసుకొని దాని అడుగున రంధ్రాన్ని పొడి ఆకులతో కప్పేయాలి. తర్వాత కొంత మట్టిని ఒక పొరగా వేసి దానిపై తడి, పొడి వ్యర్థాలను పొరలు పొరలుగా వేస్తూ నీటిని చల్లాలి. తొట్టె నిండాక పైన మట్టి కప్పాలి. ఆరుబయటైతే ముందుగా పొడిగా, నీడగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని గొయ్యి తీసి వ్యర్థాలు వేసి మట్టితో మూసేయాలి. ఈ ప్రాంతానికి చెమ్మ అందుతూ ఉంటే చాలు. మూడు నాలుగు వారాల్లోపు సేంద్రియ ఎరువు తయారవుతుంది. దీన్ని మొక్కలకు అందిస్తే ఆరోగ్యంగా ఎదుగుతాయి. పెరట్లోనే సేంద్రియ కూరగాయలను పెంచడమే కాదు, కుటుంబ ఆరోగ్యాన్నీ సంరక్షించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్