Published : 23/01/2023 00:24 IST

పిండి చల్లేందుకు...

పాతీలు చేసేటప్పుడు పీటకు అవి అంటుకోకుండా కాస్త పొడి గోధుమ పిండి చల్లడం మామూలే! కానీ పిండి కోసం డబ్బాలో చెయ్యి పెట్టడం వల్ల చేతికున్న తడి చేరి, పిండి పాడైపోతుంది. ఎక్కువ పిండి పడినా చపాతీ మృదువుగా ఉండకపోయే అవకాశమూ ఉంది. ఆధునిక మహిళ అంతరంగం తెలిసినట్టుగా.. అలాంటి కష్టం లేకుండా పిండిని సులువుగా చిలకరించేలా తయారైన పరికరమే డస్టింగ్‌ వాండ్‌. దీంతో కుకీస్‌, కేకుల మీద  పంచదార లేదా కొకొవా కూడా చల్లుకోవచ్చు. పిండి ఎక్కువ తక్కువ కాకుండా సమంగా పరుచుకుంటుంది. కేకులపై ఇలా చల్లితే అందంగా కూడా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని