ఆరంభం నుంచే అదిరిపోవాలి...

అబ్బాయిలతో సమానంగా ఉద్యోగాలు సంపాదించుకోవడమే కాదు...జీతాలూ అందుకుంటున్నారు నేటితరం అమ్మాయిలు.

Published : 23 Jan 2023 00:24 IST

అబ్బాయిలతో సమానంగా ఉద్యోగాలు సంపాదించుకోవడమే కాదు...జీతాలూ అందుకుంటున్నారు నేటితరం అమ్మాయిలు. కానీ, ఆడపిల్లలకి మనీ మేనేజ్‌మెంట్‌ తెలియదన్న అపవాదుని దూరం చేసుకోవాలంటే... మొదటి జీతం తీసుకున్నప్పటి నుంచే పక్కాగా పొదుపు పద్ధతులు పాటించాలి. అందుకోసమే ఈ సూచనలు...!

* మెచ్చే కానుకలే కానీ.. మొదటి జీతంతో ఇంట్లో వాళ్లకి బహుమతులు, ప్రేమించే వారికి మన గుర్తుగా ఏదో ఒక వస్తువూ కొనాలనుకుంటాం. అయితే, అవన్నీ ఖరీదైనవే అయ్యి ఉండాలనేం లేదు. మీ బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని మాత్రమే ఇందుకు ఖర్చు చేయండి. రాయితీల ద్వారా, నోకాస్ట్‌ ఈఎమ్‌ఐ పద్ధతుల్లో కొనగలిగేవి ఉంటే ప్రయత్నించండి. అప్పుడు ఒకేసారి భారం నెత్తిన పడదు.

* బడ్జెట్‌ వేశారా... మొదటి నెల జీతాన్ని ఎలాగూ మనం ఖర్చు పెట్టలేదు కదా ఇప్పుడైనా మన అవసరాలు తీర్చుకుందాం అని అవసరం ఉన్నవీ, లేనివీ అన్నీ కొనేస్తారు. అలా కాకుండా అత్యవసరమైన వస్తువులే కొనుక్కొని మిగిలిన వాటిని వాయిదా వేస్తేసరి. తర్వాత వాటిని ప్రాధాన్యతా క్రమంలో కొనుక్కోవచ్చు. అయితే, వీటన్నింటికంటే ముందు మీ జీతానికో బడ్జెట్‌ వేయడం మరిచిపోవద్దు.

* ప్రణాళికతో.. వచ్చే జీతం ఎంత? నిత్యావసరాలు, ఇతరత్ర ఖర్చులు ఏముంటాయి? ఎంత పొదుపు చేయాలి...వంటివన్నీ పక్కాగా లెక్కలు వేసుకోవాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ పుస్తకంలో రాసుకోవాలి. అప్పుడే వృథా ఎంతో అర్థం అవుతుంది.  మిగులూ, లోటు తెలుస్తాయి. జీతంలో ఖర్చులు పోగా కొంత భాగం అత్యవసరాలకూ, మిగిలిన దాన్ని పెట్టుబడికీ కేటాయించుకోండి. మనం డబ్బును నిరుపయోగంగా అకౌంట్లోనో, బీరువాలోనో ఉంచడం మూలంగా ఉపయోగం ఏమీ ఉండదు. వాటిని పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే అవి రెట్టింపవుతాయి. జీవితబీమాలు తీసుకోవటం వల్ల మన కుటుంబంలోని వారికీ భరోసా కల్పించొచ్చు. వీటన్నింటికీ జీతం అందుకున్న మొదటి నెల శ్రీకారం చుడితే...తర్వాత నుంచి కొనసాగించగలుగుతారు. క్రమంగా ఆర్థిక క్రమశిక్షణా అలవడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్