వంటింటి వ్యర్థాలే పోషకాలై...

మొక్కలు సరిగా ఎదగాలంటే సమయానికి ఎరువులు అందించాలి. అలాగని రసాయనిక ఎరువులు వాడితే మట్టి, మొక్కలు కూడా హానికరంగా మారతాయి. అందుకే మన వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా మార్చుకుందాం. 

Published : 25 Jan 2023 00:20 IST

మొక్కలు సరిగా ఎదగాలంటే సమయానికి ఎరువులు అందించాలి. అలాగని రసాయనిక ఎరువులు వాడితే మట్టి, మొక్కలు కూడా హానికరంగా మారతాయి. అందుకే మన వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా మార్చుకుందాం. 

అరటి తొక్కలు :  వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొద్ది మొత్తంలో నైట్రోజన్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం కూడా ఉంటాయి. అందుకే ఖాళీ కుండీలో సగం వరకూ మట్టిని నింపి అరటి తొక్కలువేయాలి. ఆపై రెండు పొరలుగా మట్టిని చల్లితే సరి... ఓ నెల రోజులకు అది ఎరువుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని కొత్తగా పూలు పూసే మొక్కలకు అందిస్తే నిండుగా పూస్తాయి.  

కోడిగుడ్డు పెంకులు: కాల్షియంతో నిండిన గుడ్డు పెంకులు మట్టిలో ఎసిడి టీని తగ్గించేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే ఫాస్పరస్‌ మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని నలిపి మొక్క మొదళ్లలో వేయొచ్చు. లేదా పొడి చేసి మొక్కను నాటే మట్టిలో కలిపేయొచ్చు.

వంటనీళ్లు : కూరగాయలను ఉడకబెట్టిన, పప్పులు కడిగిన... నీటిని వృథాగా పారేయకుండా మొక్కలకు అందిస్తే అందులోని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. చేపల్ని పెంచే నీటినీ మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. దీనిలో ఉండే సహజ నైట్రోజన్‌ మొక్క పచ్చగా ఎదగడానికి సాయపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్