మీకో జలప్రపంచం

రంగురంగుల చేపలు తిరుగాడుతూ కనిపించే అక్వేరియం ఇంటికి అందాన్నీ, ఆకర్షణను తెచ్చిపెడుతుంది. కానీ అక్వేరియం నిర్వహణ అంత తేలిక కాదు.

Published : 26 Jan 2023 00:35 IST

రంగురంగుల చేపలు తిరుగాడుతూ కనిపించే అక్వేరియం ఇంటికి అందాన్నీ, ఆకర్షణను తెచ్చిపెడుతుంది. కానీ అక్వేరియం నిర్వహణ అంత తేలిక కాదు. అది తెలియకే చేపలు చనిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

చిన్న బల్లపై ఉంచాలంటే పెద్ద అక్వేరియంలు కాకుండా గాజుపాత్ర ఆకారంలో ఉండే అక్వేరియానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎక్కువ చోటుంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నదాన్ని ఎంపిక చేసుకోవాలి. నైఫ్‌ ఫిష్‌, రేస్‌, ఈల్స్‌, గోల్డెన్‌ఫిష్‌ రకాలు చక్కని ఎంపిక. వీటికి తగినట్లుగా రంగురంగుల్లో కంకర రాళ్లు వంటివి అక్వేరియం అడుగున సర్దాలి. జీబ్రా, రెడ్‌ డెజర్ట్‌, హనీ ఓనిక్స్‌, ఐస్‌, రెయిన్‌బో రాక్స్‌ అంటూ ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల రాళ్లు లభ్యమవుతున్నాయి. నచ్చిన వాటిని ఎంచుకోండి. ఉప్పు నీటిని వాడాలనుకున్నప్పుడు నీటి అడుగున చేపలకు సహజసిద్ధమైన వాతావరణాన్ని కల్పించడానికి సముద్రపు గవ్వలుంటే బాగుంటుంది. తెరచిఉన్నట్లు అనిపించే పెద్దపెద్ద ఆల్చిప్పలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సాధారణ నీటి అక్వేరియానికి మాత్రం వీటిని వినియోగించకూడదు. వీటి నుంచి విడుదలయ్యే కాల్షియం నీటిలో కలిసి అక్వేరియం వాతావరణాన్ని పాడు చేస్తుంది.

సహజంగా.. ప్లాస్టిక్‌ మొక్కలను ఏర్పాటు చేయాలి. కాస్తంత ఇసుకను వేస్తే నిజమైన మొక్కలను కూడా అక్వేరియంలో పెంచొచ్చు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే నైట్రోజన్‌, ఆక్సిజన్‌ చేపలను తేలికగా శ్వాస తీసుకొనేలా చేస్తాయి. అయితే వీటి ఆకులు కుళ్లినప్పుడు వెంటనే తొలగించేయాల్సి ఉంటుంది. అలా కాకూడదంటే ప్లాస్టిక్‌ మొక్కలను సర్దుకుంటే మంచిది. అలాగే అక్వేరియం వెనుకవైపు సహజంగా అనిపించేలా బ్యాక్‌గ్రౌండ్‌ ఏర్పాటు చేయడం మర్చిపోకండి. సముద్రపుటడుగున ఉండే వాతావరణాన్ని ఒక షీట్‌పై పెయింట్‌ చేసి దాన్ని చేపలతొట్టెకు వెనుకవైపు అంటిస్తే చాలు. చేపలను లోపల వదిలేముందు ఆక్సిజన్‌ను ప్యూరిఫై చేసే మోటర్‌, లైట్‌ను ఏర్పాటు చేయాలి. చివరగా ఆ చేపలకు సరైన ఆహారాన్ని ఆయా సమయాలకు తగ్గట్లు అందిస్తే చాలు. కనీసం రెండు లేదా మూడు వారాలకొకసారి అక్వేరియంను శుభ్రపరిచి, నీటిని మార్చడం మర్చిపోకండి. రంగురంగుల చేపలతో ఇంటికి అందాన్నిచ్చే చేపలతొట్టె వద్ద రోజూ కాసేపు కూర్చుంటే మనసంతా ప్రశాంతంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్