ఇలా చేసి చూడండి...

మనందరికీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఉంటుంది. కానీ ఉద్యోగ బాధ్యతలతో అలసిసొలసే మనకు అది కొంచెం కష్టమైన అంశమే. అలాగని ఇంటీరియర్‌ డిజైనర్లు వచ్చి అలంకరించాల్సిన అవసరమేమీ లేదు.

Published : 30 Jan 2023 00:02 IST

మనందరికీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఉంటుంది. కానీ ఉద్యోగ బాధ్యతలతో అలసిసొలసే మనకు అది కొంచెం కష్టమైన అంశమే. అలాగని ఇంటీరియర్‌ డిజైనర్లు వచ్చి అలంకరించాల్సిన అవసరమేమీ లేదు. చిన్నచిన్న పద్ధతులు అవలంబించి కూడా కళాత్మకంగా మార్చుకోవచ్చంటూ నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఆ సలహాలను మీరూ పాటించి చూడండి..

* అందరిళ్లలాగే మనింట్లోనూ కుర్చీలూ మంచాలు లాంటి గృహోపకరణాలు సాధారణమైనవే ఉంటాయి కదూ! కానీ ప్రత్యేకత ఉట్టిపడుతూ అదనపు అందం సమకూరాలంటే ఆయా వస్తువుల్లో భిన్నమైన వాటిని ఎంచుకోవాలి. మామూలుగా టీపాయ్‌లు గుండ్రంగానో, చతురస్రాకారంగానో ఉంటాయి. మీరు సీతాకోక చిలుక ఆకృతిలో ఉన్నదాన్ని కొన్నారనుకోండి.. అదెంత విభిన్నంగా ఉంటుంది?! మీకు నచ్చడమే కాదు, ఇంటికొచ్చిన అతిథుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది.

* బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లినప్పుడు లేదా అంతర్జాలంలో పురాతన సామగ్రిని పరిశీలించండి. వాటిల్లో మీకు నచ్చిన వాటిని సేకరించి మీ ఇంట్లో అలంకరించండి. అధునాతన వస్తువులతో ముచ్చటగొలిపే మీ ఇంట్లో ఆ యాంటిక్‌ పీసెస్‌ చేరి అందాలు ద్విగుణీకృతమవుతాయి. చిన్న రాజభవనాన్ని తలపిస్తుందంటే అతిశయం కాదు.

* ఎక్కువ స్థలం ఆక్రమించని తరహా కుర్చీలను ఎంచుకోండి. అవెంతో ఆకర్షణీయంగా ఉంటాయి. బరువుండవు కనుక ఇల్లు తుడిచేటప్పుడు పక్కకు తీయడం, వేరే గదిలోకి తీసుకెళ్లడం సులువవుతుంది. వాటిని శుభ్రపరచడమూ తేలికే.

* కిటికీల్లో వస్తువులు పేరుస్తుంటే శోభ తగ్గడమే కాదు, తలుపులు తెరవడం కష్టమవుతుంది. కిటికీలు తెరిచి గాలీ వెలుతురుని లోపలికి ఆహ్వానిస్తే ఇల్లు కాంతివంతంగానూ ఉంటుంది, మన ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్