రాసుకుంటేనే గుర్తుండేది!

పడకగదినీ, హాల్‌నీ సర్దినట్లుగా...వంటగదిపై శ్రద్ధపెట్టం. కానీ, ఎక్కువ సమయం మనం గడిపేది అక్కడే. సులువుగా, సౌకర్యంగా వంట పూర్తవ్వాలన్నా, శుచీ, రుచీ వంటకాల్లో ఉండాలన్నా...ఈ మార్పులు చేసి చూడండి.

Published : 01 Feb 2023 00:21 IST

పడకగదినీ, హాల్‌నీ సర్దినట్లుగా...వంటగదిపై శ్రద్ధపెట్టం. కానీ, ఎక్కువ సమయం మనం గడిపేది అక్కడే. సులువుగా, సౌకర్యంగా వంట పూర్తవ్వాలన్నా, శుచీ, రుచీ వంటకాల్లో ఉండాలన్నా...ఈ మార్పులు చేసి చూడండి.

* ఎంత చిన్న గది అయినా పొందికగా కనిపించాలంటే...సర్దుకోవడంలోనే ఉంటుంది. ముందు వంటగదిలో పనికిరాని వస్తువులన్నీ పక్కన తీసి పెట్టేయండి. పప్పూ, ఉప్పూ, మసాలా దినుసులు వంటివి రోజువారీ అవసరాలకు వాడుకునేందుకు చిన్న చిన్న గాజు సీసాల్లో నింపుకోండి. వీలైనంతవరకూ ఇవన్నీ ఒకే పరిమాణం, ఆకృతిలో ఉంటే చూడ్డానికీ బాగుంటుంది. సులువుగా ఎందులో ఏమున్నాయో గుర్తించొచ్చు.  

* వంటచేసేప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో తెలియక...అన్నింటినీ చిందరవందర చేసేస్తుంటారు కొందరు. ఏ తరహా వంటకు ఏం వస్తువులు కావాలో వాటిని విడివిడిగా ఓ ట్రేలో పెట్టుకోండి. టీ పెడుతుంటే టీపొడి, పంచదార, యాలకులూ...వంటివన్నీ ఒకదానిలో కూర వండుతుంటే వాడేందుకు అవసరమయ్యే ఉప్పు, కారం, పసుపు, మసాలా దినుసులు మరోట్రేలో పెట్టుకోండి. ఎప్పుడు ఏది అవసరమైతే దాన్నే తీసుకుంటే సరి. అప్పుడు కాస్త కంగారు తగ్గుతుంది. వంటగది పద్ధతిగానూ కనిపిస్తుంది.

వంటగది గోడపై మీకు అదేంత ఎత్తులో ఓ చిన్న బ్లాక్‌ బోర్డ్‌ వేలాడదీయండి. దానిపై మీ మెనూ, కావలసిన వస్తువులూ, కొనాల్సిన వంట సామగ్రి వివరాల వంటివన్నీ రాసుకుంటే అవసరానికి గుర్తురానివంటూ ఏమీ ఉండవు.

* గోడలకు ఉన్న అరలన్నీ వస్తువులతో నిండిపోతే.. కొన్నింటిని పై నుంచి వేలాడదీసిన హుక్స్‌కి తగిలించుకోవచ్చు. ప్లేట్‌ర్యాక్స్‌, గ్లాస్‌హోల్డర్స్‌ వంటివి తక్కువ ధరల్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. వాటిని ఎంచుకుంటే వంటగది అందం కూడా ఇనుమడిస్తుంది. పళ్లాలూ, గ్లాసుల సెట్లు కూడా కాస్త భిన్నమైన రంగులున్నవి ఎంచుకుంటే చూడ్డానికి బాగుంటాయి. పిల్లలూ పెద్దలూ పదార్థాలని ఇష్టంగా తింటారు. ఇక, వంటింట్లో వస్తువులు అవసరానికి మించి ఉంటే కాస్త గందరగోళంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్