మనకి మనమే అన్నీ...

ఇంటా బయటా బాధ్యతలు నెరవేర్చే క్రమంలో ఒక్కోసారి ఒత్తిడికి లోనవుతుంటాం. ఆయా పనుల్లో ఆటంకాలు ఎదురైతే.. అనుకున్న రీతిలో చేయలేకపోతే.. మరేవో సమస్యలెదురైతే.. నిరాశా నిస్పృహలు తప్పవు. మరి ఆ బాధ, భయాల నుంచి బయటపడేదెలా? ఎవరో వచ్చి ఓదారుస్తారు, కష్టం కనుమరుగైపోతుంది- అనుకుంటే ఆనక భంగపాటు కలగొచ్చు.

Published : 06 Feb 2023 00:24 IST

ఇంటా బయటా బాధ్యతలు నెరవేర్చే క్రమంలో ఒక్కోసారి ఒత్తిడికి లోనవుతుంటాం. ఆయా పనుల్లో ఆటంకాలు ఎదురైతే.. అనుకున్న రీతిలో చేయలేకపోతే.. మరేవో సమస్యలెదురైతే.. నిరాశా నిస్పృహలు తప్పవు. మరి ఆ బాధ, భయాల నుంచి బయటపడేదెలా? ఎవరో వచ్చి ఓదారుస్తారు, కష్టం కనుమరుగైపోతుంది- అనుకుంటే ఆనక భంగపాటు కలగొచ్చు. అంతకంటే మనకు మనమే ధైర్యం చెప్పుకొని, ఉపశమనం పొందాలి. సమస్యల్ని అధిగమించాలి. అందుకు అనుభవజ్ఞులు సూచిస్తున్న కొన్ని మార్గాలు చూడండి...

దుఃఖం కలిగినప్పుడు కాసేపు ఆ విషయాన్ని పక్కనపెట్టి ఒక మంచి పుస్తకం చదవండి, లేదా చక్కని సినిమా చూడండి.

కొంతసేపు ప్రకృతిని ఆస్వాదించండి. వీలైతే దగ్గర్లో ఉన్న నది, కొండ, ఉద్యానవనం చూసిరండి. కుదరకపోతే మబ్బుల్ని చూస్తూ కూర్చోండి, ప్రశాంతంగా ఉంటుంది.

దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని కొంతసేపు నిలిపి.. అంతే దీర్ఘంగా శ్వాస వదలాలి. ఇలా అరగంటసేపు శ్వాస మీద ధ్యాస పెట్టారంటే మీలో ఎంత మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది.

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలను వదిలేసి ఒకసారి ఆప్తులకు ఫోన్‌ చేసి మాట్లాడండి.

బొమ్మలేయడం, పాట పాడటం, నృత్యం, ఎంబ్రాయిడరీ, మిమిక్రీ లాంటివేమైనా సరే.. మీకు ఇష్టమైన కళలో కొంతసేపు సాధన చేస్తే సరి.

పరగడపున యోగా చేయండి. ఉదయం కుదరకపోతే రెండు గంటలు ఖాళీ కడుపుతో ఉండి రెండు మూడు ఆసనాలు వేయండి. లేదా అరగంటసేపు వ్యాయామం చేయండి.

బంధు మిత్రులెవరినైనా ఇంటికి ఆహ్వానించండి. లేదా మీరే వారింటికి వెళ్లండి. కాసేపు ఇష్టమైన వారితో ముచ్చటిస్తే తిరిగి రీఛార్జవుతారు.

వేళ కాని వేళ అయినా సరే.. కలతను మర్చిపోవడానికి కొంతసేపు పడుకోండి. సేదతీరాక ఆలోచించండి.

ఇవేమీ బాధను తుడిచేయవు. కానీ మనసును కాసేపు మళ్లిస్తాయి. అలా దుఃఖ తీవ్రత తగ్గుతుంది. సమస్యను తలచుకుని తల్లడిల్లడానికి బదులు దాని మూలాలు, కారణాల గురించి ఆలోచిస్తారు. పరిష్కార మార్గాలను అన్వేషించి అనుసరిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్