కావలసినట్లు ఉడికిస్తుంది!

ప్రయాణాల్లో ఉన్నప్పుడు, వేగంగా వండాల్సి వచ్చినప్పుడు... పదే పదే దగ్గరుండి ఉడికిందో లేదో చూసుకోనక్కర్లేకుండా...అవి తయారైపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అలాంటి పరికరమే ఈ ప్రెసిషన్‌ కుక్కర్‌. వేడినీళ్లు నింపిన పాత్రలో నిలువుగా దీన్ని అమర్చి... ఫుడ్‌గ్రేడ్‌ జిప్‌లాక్‌ కవర్లలో ఉడికించాల్సిన కూరగాయలు, మాంసం వంటివాటిని ఉంచి అందులో వేయాలి.

Updated : 18 Feb 2023 02:58 IST

ప్రయాణాల్లో ఉన్నప్పుడు, వేగంగా వండాల్సి వచ్చినప్పుడు... పదే పదే దగ్గరుండి ఉడికిందో లేదో చూసుకోనక్కర్లేకుండా...అవి తయారైపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అలాంటి పరికరమే ఈ ప్రెసిషన్‌ కుక్కర్‌. వేడినీళ్లు నింపిన పాత్రలో నిలువుగా దీన్ని అమర్చి... ఫుడ్‌గ్రేడ్‌ జిప్‌లాక్‌ కవర్లలో ఉడికించాల్సిన కూరగాయలు, మాంసం వంటివాటిని ఉంచి అందులో వేయాలి. ఫోన్‌తో అనుసంధానం చేసిన యాప్‌లో ఆయా పదార్థాల వివరాలను నమోదు చేయాలి. దాన్ని బట్టి ఈ పరికరం ఉష్ణోగ్రతను దానంతట అదే సెట్‌ చేసుకుంటుంది. పదార్థం ఉడకగానే... సందేశాన్ని ఫోన్‌కి అందిస్తుంది. దీనివల్ల పొయ్యితో పనిలేకుండానే సగం వంటని ఎంచక్కా దీనిలోనే పూర్తి చేసేయొచ్చు. బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్