అలంకరణకీ పెంచేయండి!

వ్యాపకం, స్వచ్ఛమైన గాలి.. ఇలా ఎన్నో కారణాలతో మొక్కలు పెంచడం మామూలే. ఇప్పుడు ఇంటి డెకార్‌కు అనుగుణంగానూ మొక్కలను ఎంచుకుంటున్నారు. చూడటానికి అందంగా ఉంటూ తక్కువ నిర్వహణ అవసరమయ్యే వీటి గురించీ తెలుసుకోండి. ఆకులే అందం.. పెద్దగా, డిజైన్‌ చేసినట్టుగా ఉంటాయి స్విస్‌ చీజ్‌ ప్లాంట్స్‌ ఆకులు.

Published : 18 Feb 2023 00:14 IST

వ్యాపకం, స్వచ్ఛమైన గాలి.. ఇలా ఎన్నో కారణాలతో మొక్కలు పెంచడం మామూలే. ఇప్పుడు ఇంటి డెకార్‌కు అనుగుణంగానూ మొక్కలను ఎంచుకుంటున్నారు. చూడటానికి అందంగా ఉంటూ తక్కువ నిర్వహణ అవసరమయ్యే వీటి గురించీ తెలుసుకోండి.

ఆకులే అందం.. పెద్దగా, డిజైన్‌ చేసినట్టుగా ఉంటాయి స్విస్‌ చీజ్‌ ప్లాంట్స్‌ ఆకులు. ఎక్కడ ఉంచినా ఆ ప్రదేశానికి ప్రత్యేకతను ఇస్తాయి. పొడవుగా పెరిగే ఈ మొక్కలు ఉంచిన చోట వేరే అలంకరణ అవసరమూ ఉండదు. నేరుగా ఎండలో ఉంచకూడదు. నీరెండ సరిపోతుంది. వేగంగా పెరుగుతాయి. కుండీలో మట్టి మొత్తం పొడారింది అనిపించినప్పుడు నీరందిస్తే చాలు. వీలున్నప్పుడల్లా తడి వస్త్రంతో ఆకులను తుడుస్తుండాలి. మొక్క వేగంగా పెరుగుతుంది కాబట్టి, తగ్గట్టుగా కుండీని అమర్చాలి.

గోడకి.. ఒకప్పుడు మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి అందుకు తగ్గ స్థలం లేకపోవడం పెద్ద బెంగ. ఇప్పుడు అదో సమస్యే కాదు. గోడకు అలంకరణగానూ పెంచుకునే వీలుంటోంది. హోయా ఈ విధానానికి ఉత్తమ ఎంపిక. పచ్చగా, మందమైన ఆకులతో ఉండే ఈ మొక్క మట్టి మొత్తం పొడిబారినా బతకగలదు. రోజూ చాలా కొద్ది మొత్తంలో నీరు, నీరెండ ఉంటే చాలు. వివిధ రంగుల్లో పూలు కూడా పూస్తాయి. ఆర్కిడ్స్‌, పోతోస్‌ కూడా ఈ తరహా పెంపకానికి సానుకూలం.

గదిని బట్టి.. గది అలంకరణకి తగ్గ మొక్కలు కావాలనుకునేవారూ లేకపోలేదు. వారికి కోసమూ డిజైనర్‌ మొక్కలున్నాయి. బిగోనియా, అలోకేసియా క్యుపెరా, బ్రాండ్‌టియానమ్‌ మొక్కలు రంగుల ఆకులు, వాటిపై చుక్కలు, గీతలతో గదికే ప్రత్యేక అందాన్ని తెస్తాయి. అరుదుగా తక్కువ ఎండలో ఉంచితే చాలు. వీటిల్లో బోలెడు రకాలూ దొరుకుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్