నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌ రెడీ...

ఐస్‌క్రీమ్‌ అనగానే మన బుడతలు పరుగులు పెడుతుంటారు. చిన్న నుంచి పెద్ద వరకు దీన్ని మెచ్చని వారుండరు. అసలే ఎండాకాలం.. దీనికి ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. 

Published : 03 Mar 2023 00:08 IST

ఐస్‌క్రీమ్‌ అనగానే మన బుడతలు పరుగులు పెడుతుంటారు. చిన్న నుంచి పెద్ద వరకు దీన్ని మెచ్చని వారుండరు. అసలే ఎండాకాలం.. దీనికి ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. పాలు, పంచదార, క్రీమ్‌, కస్టర్డ్‌ పౌడర్‌ కలిపి నచ్చిన పండ్లను వేసి తయారు చేసే ఐస్‌క్రీమ్‌ను... చెబుతుంటేనే నోరూరుతోంది కదూ... ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేకుండా ఇంట్లోనే ఐస్‌క్రీమ్‌ను తయారు చేసుకునే డిజిటల్‌ మేకింగ్‌ మెషిన్‌ ఇది. ఫ్రీజర్‌లో పెట్టాల్సిన పని లేకుండా గ్రైండ్‌ అవుతున్నప్పుడే ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తూ నిమిషాల్లో నోరూరించే ఐస్‌క్రీమ్‌ను మనకి అందించేస్తోంది...

ఎలా వాడాలంటే... ముందుగా ఐస్‌క్రీమ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలన్నింటిని రెడీగా ఉంచుకోవాలి. నచ్చిన పండ్ల జ్యూస్‌ను తీసి పెట్టుకోవాలి. ఐస్‌క్రీమ్‌ మిక్స్‌ గిన్నెను మెషిన్‌లో పెట్టి, గ్రైండ్‌ చేసే పెడల్‌ను బిగించాలి. టైమర్‌ను సెట్‌ చేసి స్విచ్‌ ఆన్‌ చేస్తే సాఫ్ట్‌గా, క్రీమీగా ఉండే ఐస్‌క్రీమ్‌ నిమిషాల్లో మన ముందుంటుంది. స్క్రూబ్స్‌ కావాలనుకుంటే బౌల్‌మార్చి ఫ్రీజర్‌లో పెట్టెస్తే సరి. రుచికి, రుచి... ఆరోగ్యానికి. ఆరోగ్యం అందించే డిజిటల్‌ ఐస్‌క్రీమ్‌ మేకింగ్‌ మెషిన్‌ భలే ఉంది కదూ... మీకూ కావాలనిపిస్తుందా... లేట్‌ ఎందుకు? ఆన్‌లైన్‌ వేదికల్లో వేతికేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్