Published : 06/03/2023 00:15 IST

పిండి కోసం.. శ్రమ ఉండదిక

దోశ, ఇడ్లీ, గారె.. రోజుకో రకం టిఫిన్‌ చేయాల్సిందే. వీటి పిండ్లు సిద్ధం చేసుకోవడమేమో పెద్ద పని! ఏముంది మిక్సీలు, గ్రైండర్‌లు ఉన్నాయిగా అని తేలిగ్గా అనేస్తారు. కానీ దానికీ శ్రమ ఎక్కువే. మిక్సీలో ఇడ్లీ, దోశ అంత రుచిగా ఉండవని గ్రైండర్‌ని ఆశ్రయించేవాళ్లే ఎక్కువ. తీరా పిండిని గిన్నెలోకి మార్చడం.. రాళ్లను కడగడం. అదో శ్రమ. దాన్నీ సులువు చేస్తూ వచ్చాయి స్మార్ట్‌ ఫింగర్స్‌ వెట్‌ గ్రైండర్లు. చేయి పెట్టకుండానే పిండి గిన్నెలోకి నేరుగా తీసుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా బయటికి గొట్టం ఉంటుంది. కడగడం తేలికే.. లోపల నీరు పోసి, ఒంపేసుకుంటే చాలు. రాళ్లు తీసి, అమర్చడం వంటివి లేకుండా పని పూర్తవుతుంది. అదనంగా చపాతీ పిండినీ కలిపేస్తుంది. గోధుమ పిండిని వేసి, తగినన్ని నీళ్లు పోస్తే చాలు. ఇలాంటి దానికోసమే వేచి చూస్తున్నారా.. ఇంకేం తెచ్చేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని