మీరు చిటికె వేయండి!

అల్లాఉద్దీన్‌ దీపమో.. ఏ మ్యాజిక్‌ స్టిక్కో ఉంటే ఎంత బావుణ్ను అని ఏదోక సందర్భంలో అనుకొని ఉంటాం కదా! ఇల్లు, ఆఫీసు, పిల్లలు..

Updated : 08 Mar 2023 00:39 IST

అల్లాఉద్దీన్‌ దీపమో.. ఏ మ్యాజిక్‌ స్టిక్కో ఉంటే ఎంత బావుణ్ను అని ఏదోక సందర్భంలో అనుకొని ఉంటాం కదా! ఇల్లు, ఆఫీసు, పిల్లలు.. ఇన్ని బాధ్యతల మధ్య ఇలా అనిపించడం సహజమే! దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని సంస్థలు ‘మీరు చిటికేయండి చాలు’ మా సేవలతో మీ పనుల్నీ సులభతరం చేస్తామంటున్నాయి.  అవేంటంటారా...

*  చకచకా వండేయొచ్చు.. ఇంటిల్లిపాదికీ తాజాగా వండిపెట్టాలనే అనుకుంటాం. ఒక్కోసారి సమయం, ఓపిక ఉండవు.. ఇలాంటివారికోసమే వంటకానికో రకం కూరగాయల్ని తరిగి అందిస్తున్నాయి కొన్ని సంస్థలు. సెలవుల్లో బిర్యానీ, పిజ్జా, కేక్‌ అంటూ బోలెడు కోరికలు. వాటిని సొంతంగా చేసుకోవాలనుకున్నా కావలసిన పదార్థాలనూ అందిస్తున్నాయి. కార్ట్జ్‌ఫ్రెష్‌, బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ, జొమాటో వంటివాటిల్లోనూ ఈ సౌకర్యం ఉంది.

*  ఒక్కరోజు సేవలు.. ఆరోగ్యం బాగోలేదు.. పండగ ముందు ఇల్లు దులపడం, సర్దడం.. పనిమనిషి సాయముంటే బాగుండ నిపిస్తుంది. కానీ, కొన్నిరోజుల భాగ్యానికి అవసరమా..అనవసరపు ఖర్చు అనిపిస్తుంది. ఇలాంటప్పుడూ అక్కరకొచ్చే సేవలున్నాయని తెలుసా? గిన్నెలు తోమిపెట్టడం నుంచి ఒక్కరోజు, నెలరోజులు.. కావాల్సినన్ని రోజులు పనివాళ్లను బుక్‌ చేసుకోవచ్చు. లేబర్‌ అడ్డా, బ్రూమీస్‌, హైర్‌ మెయిడ్‌ వంటి సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి.

* తేలిగ్గా సిద్ధమవొచ్చు.. మిగతా సమయాల్లో ఎలాగున్నా వేడుకలప్పుడు మెరవాల్సిందే! దీనికి పార్లర్‌ వరకూ వెళ్లడం, గంటలకొద్దీ వేచిచూడ్డం సమయం వృథా! అర్బన్‌ క్లాప్‌, హౌజ్‌ జాయ్‌, మైగ్లామ్‌, ఎస్‌ మేడమ్‌ వంటి సంస్థలు..తమ సెలూన్‌ సర్వీసులన్నీ ఇంటికొచ్చే చేస్తున్నాయి. దగ్గరుండి రెడీ చేసి వెళతాయి. ఇవేమీ వద్దు.. చీర కట్టినా చాలు.. కుచ్చిళ్లు పెడితే చాలు అనుకున్నా.. ఆ సేవలను అందించేవారూ ఉన్నారు. ఇవేకాదు ఇంటికి సంబంధించిన పనులన్నీ కాలు బయటపెట్టకుండానే చేయించేసుకోవచ్చు. కాస్త ఫోన్‌కి పనిచెప్పాలంతే!

* అలా ఆలోచిస్తున్నారా.. ఇంట్లో వేడుక ఏదైనా ఉంటే బోలెడు ఖర్చు. షాపింగ్‌లకు తిరగడం, వాటిని కుట్టించడం.. సైజులు చూసుకోవడం.. ఎంత పనో! క్లౌడ్‌ టైలర్‌, సిలాయిలర్‌, ఫ్యాబ్‌స్టిచ్‌ వంటి సంస్థల సాయం తీసుకోండి. కుట్టి తీసుకొచ్చి మరీ చేతిలోపెడతారు. దుస్తులకు ఇంతింత పెట్టాలా.. ఒక డ్రెస్‌, చీరనే ప్రతిదానికీ కట్టలేం కూడా! డబ్బు వృథా అంటారా? పార్టీలు, వేడుకలు సంప్రదాయం, ఆధునికం ఏదైనా దుస్తులను అద్దెకు తీసుకోవచ్చు.   ఫ్లైరోబ్‌, స్విష్‌లిస్ట్‌, రెంటింట్‌బే, రెంట్‌ఏక్లోజెట్‌ సంస్థలు ఆ సేవలందిస్తున్నాయి. కొన్ని దుస్తులకు తగ్గ నగలు, యాక్సెసరీలనూ అద్దెకిస్తున్నాయి.

రోజూ పూజకు పూలు, పండగలు, వ్రతాలకు కావాల్సిన సామగ్రి.. ఇంకొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకేసి పూజలకు తగ్గ అలంకరణనీ చేసిపెడుతున్నాయి. కాబట్టి.. పని సులువు చేసే సేవలున్నాయి. అనవసర ఖర్చనో, ఖాళీ సమయం ఉందనో అన్నింటినీ మీదేసుకోక.. అప్పుడప్పుడైనా వీటిని వినియోగించుకోండి. చిటికెలో కాకపోయినా ప్రశాంతంగా పని పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్