ఇల్లు కలుషితం కాకుండా...

శుభ్రం అంటూ పదే పదే చేతులు కడుక్కునే అలవాటు మీకుందా?  దుర్వాసన దూరం చేస్తాయని పెర్‌ఫ్యూమ్‌లని తెగ వాడేస్తున్నారా? క్రిములు నశిస్తాయని తుడిచే నీళ్లల్లో ఫ్లోర్‌ క్లీనర్లు వాడుతున్నారా? అయితే, మీరు కాలుష్యం బారిన పడుతున్నట్లే అంటున్నారు నిపుణులు.

Updated : 11 Mar 2023 00:45 IST

శుభ్రం అంటూ పదే పదే చేతులు కడుక్కునే అలవాటు మీకుందా?  దుర్వాసన దూరం చేస్తాయని పెర్‌ఫ్యూమ్‌లని తెగ వాడేస్తున్నారా? క్రిములు నశిస్తాయని తుడిచే నీళ్లల్లో ఫ్లోర్‌ క్లీనర్లు వాడుతున్నారా? అయితే, మీరు కాలుష్యం బారిన పడుతున్నట్లే అంటున్నారు నిపుణులు. అదెలాగంటారా?

* మనం ఎంతో శుభ్రంగా ఉందనుకున్న ఇంట్లోనూ కాలుష్య కారకాల శాతం ఎక్కువేనని హెచ్చరిస్తుంది ఓ అధ్యయనం. ముఖ్యంగా మనం వాడే కాస్మెటిక్స్‌... రూమ్‌ ఫ్రెషనర్లు, సబ్బులూ, క్రీంలూ, క్లీనర్లు, ఫర్నిచర్‌, ఏసీ... వంటి ఎన్నో రకాల ఉత్పత్తుల నుంచి కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి. ఇవి సంతానోత్పత్తి, వ్యాధినిరోధకశక్తి, నాడీమండలాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి బారిన పడకూడంటే...అవసరం లేనిదే ఈ ఉత్పత్తుల వాడకం వద్దని చెబుతున్నారు. ఇంట్లోని కాలుష్య కారక గాలిని శుద్ధి చేసేందుకు నాసా ధృవీకరించిన మనీప్లాంట్‌, ఫిలడెండ్రాన్‌, పీస్‌లిల్లీ, ఆంథూరియం వంటి వాటిని పెంచుకోండి.

* చేతులు కడుక్కోవడానికి సహజ పద్ధతులను వినియోగించండి. కుంకుడు రసాన్ని తీసి.. ఓ డబ్బాలో పోసి వాడుకోండి. లేదంటే బేకింగ్‌ సోడాకి చిటికెడు ఎసెన్షియల్‌ నూనె కలిపి చేతులకు రుద్ది శుభ్రం చేసుకోండి. సులువుగా, సహజంగా మురికి వదిలిపోతుంది.

* వంట సోడాకి జిడ్డు, రసాయనాల్ని సులువుగా వదిలించే శక్తి ఉంటుంది. అందుకే గిన్నెలు తోమిన తరువాత చివరి నీళ్లల్లో కాస్త వంటసోడా చల్లి వాటిని కడిగితే సరి. నేల తుడిచేప్పుడు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే... శుభ్రపడుతుంది... సూక్ష్మక్రిములూ దరిచేరవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్