ఇంటిని బడ్జెట్లో అలంకరిద్దాం...

ఇల్లు ఎన్నిసార్లు సర్దినా.. వారం వరకే! మళ్లీ గజిబిజి.. ఏవీ ఉండాల్సిన చోట ఉండవు. ఆఫీసు నుంచి రాగానే ఇలాంటి వాతావరణమే విసుగు పుట్టిస్తుందా.. అందుకు ఈసారి చిన్న చిన్న మార్పులను చేసి చూడండి..

Published : 12 Mar 2023 00:11 IST

ఇల్లు ఎన్నిసార్లు సర్దినా.. వారం వరకే! మళ్లీ గజిబిజి.. ఏవీ ఉండాల్సిన చోట ఉండవు. ఆఫీసు నుంచి రాగానే ఇలాంటి వాతావరణమే విసుగు పుట్టిస్తుందా.. అందుకు ఈసారి చిన్న చిన్న మార్పులను చేసి చూడండి..

ఇంటికి కళ తెచ్చేవి గోడలే.. చక్కని రంగుల వాల్‌పేపర్లను అంటిస్తే.. ఆ గదికే కొత్త కళ వస్తుంది. హుందాతనాన్ని ఇస్తాయి. మార్కెట్లో అతికించేవి బోలెడు బడ్జెట్లో దొరుకుతాయి. కొన్నాళ్లు పోయాక తేలికగా తీసేసి మరోటి అతికించేయెచ్చు.

తినే ప్లేట్లు రకరకాలు.. ప్లాస్టిక్‌, చెక్క, సిరామిక్‌.. కాస్త రంగు వెలసినా, పగిలినా పారేస్తుంటాం. పెయింటింగ్‌ను ఇష్టపడేవారు.. నచ్చిన రంగులతో కొత్తరూపం ఇవ్వొచ్చు. ఫ్యాబ్రిక్‌, రాళ్లు జతచేయొచ్చు. ఎంచక్కా గోడకు అలంకరణ వస్తువైపోతుంది.

పూలజాడీలు.. చిన్నవి. డైనింగ్‌ బల్లపై ఉంచితే చూడచక్కగా ఉంటుంది. వాడని వాటిని హాల్‌లో ఓ మూలకు ఉంచండి.

ఇందులో నచ్చిన, చక్కని సువాసనల్ని వెదజల్లే మొక్కల్ని పెంచండి. చూడటానికి అందంగా, ఆహ్లాదకరంగానూ ఉంటాయి.
గది తలుపునకు మరో రంగు వేయండి. ఎప్పుడు చూడు అదే గోధుమ రంగు.. కాస్త వినూత్నతకు చోటివ్వండి. నారింజ, పసుపు, గులాబీలను ప్రయత్నించండి.

విభిన్న అంచులతో కూడిన పెద్ద అద్దాల్ని గోడకు పెట్టండి. గదంతా కొత్తగా రూపుదిద్దుకుంటుంది.
మీ ఫర్నీచర్‌ ఉన్నచోటు నుంచి ఇంకోచోటికి సర్దేయండి. దిశ మారిస్తే మరింత ఖాళీ దొరుకుతుంది. వీటితోపాటు ఫొటో ఫ్రేములను, షోపీస్‌లను పెడితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్