వర్ణాల వయ్యారి బిళ్ల గన్నేరు

పూల మొక్కలు ఉంటే ఆ పరిసరాలు ఎంతందంగా ఉంటాయో అనుకోని వారుండరు. కాలమేదైనా, మన ఇంటిని కుసుమాల వనంగా మార్చగలిగే మొక్కల్లో వింకారోజ్‌ ఒకటి. దీన్నెలా పెంచాలో చూద్దామా! తళతళా మెరిసే ఆకుపచ్చని ఆకులూ, రంగు రంగుల పూలతో మురిపించే ఈ మొక్కని మన తెలుగులోగిళ్లలో బిళ్లగన్నేరుగా పిలుస్తారు.

Published : 21 Mar 2023 00:12 IST

పూల మొక్కలు ఉంటే ఆ పరిసరాలు ఎంతందంగా ఉంటాయో అనుకోని వారుండరు. కాలమేదైనా, మన ఇంటిని కుసుమాల వనంగా మార్చగలిగే మొక్కల్లో వింకారోజ్‌ ఒకటి. దీన్నెలా పెంచాలో చూద్దామా!

ళతళా మెరిసే ఆకుపచ్చని ఆకులూ, రంగు రంగుల పూలతో మురిపించే ఈ మొక్కని మన తెలుగులోగిళ్లలో బిళ్లగన్నేరుగా పిలుస్తారు. ఇది ఎలాంటి నేలలో అయినా సులువుగా నిలదొక్కుకుంటుంది. విత్తనాలు, వేర్లను నాటి పెంచుకోవచ్చు.

తెలుపు, గులాబీ, ఎరుపూ, పసుపూ వంటి ఎన్నో వర్ణాల్లో దొరికే ఇది కుండీల్లోనూ చక్కగా ఎదుగుతుంది. తొట్టెల్లో పెట్టి బాల్కనీల్లోనూ వేలాడదీయొచ్చు. అలానే ఇంట్లో స్థలం కాస్త ఎక్కువ ఉంటే...బోర్డరు, రాక్‌ గార్డెన్‌లానూ మలుచుకోవచ్చు.

ఎంతటి ఎండనైనా తట్టుకోగల ఈ మొక్క నీటి ఎద్దడిని తట్టుకోగలదు. అయితే, మొక్కలు ఎక్కువగా పూలు పూయాలంటే ఎరువులు క్రమం తప్పక వేయాలి. ముఖ్యంగా నెలకోసారి ఎన్‌పీకే సమాన నిష్పత్తిలో ఉండే ఎరువుని నీళ్లలో కలిపి అందిస్తే సరి. బోలెడు పూలు పూస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్