తోరణాలు.. తీరుగా!

పండగ ఏదైనా గుమ్మాలకు తోరణాలతోనే సందడి మొదలువుతుంది. అలాగని సాదాసీదాగా పెట్టేస్తే కొత్తేముంటుంది చెప్పండి? ఇలా ప్రత్యేకంగా చేయండి. గుమ్మం నుంచే పండగ కళ మొదలవుతుంది.

Updated : 22 Mar 2023 04:49 IST

పండగ ఏదైనా గుమ్మాలకు తోరణాలతోనే సందడి మొదలువుతుంది. అలాగని సాదాసీదాగా పెట్టేస్తే కొత్తేముంటుంది చెప్పండి? ఇలా ప్రత్యేకంగా చేయండి. గుమ్మం నుంచే పండగ కళ మొదలవుతుంది.

* నాలుగాకులు తీసుకొని మధ్యకు మడవాలి. మూడు ఒక దగ్గర మరొకటి విడిగా కనిపించేలా పట్టుకొని దానిపై ఏదైనా పువ్వుంచి దారంతో కుట్టాలి. ఇలా నాలుగైదు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పొడవైన దారానికి పూలను ఎక్కిస్తూ మధ్య మధ్యలో ఈ పూ తోరణాలను ఉంచండి. గుమ్మం ఎంత కళగా మారిపోతుందో!

* నాలుగైదు ఆకుల్ని ఒక దానిమీద ఒకటి నక్షత్రాకారం వచ్చేలా పెట్టి, వాటి మీద పువ్వుంచి కుట్టేయాలి. కొన్నింటిని అలా సిద్ధం చేసుకున్నాక ఒకదానికొకటి కలుపుతూ కుట్టుకోవాలి. ఫొటోలో చూపించినట్లుగా చివర్లు పొడవుగా మధ్యలో కాస్త ఎత్తు తగ్గించుకుంటూ వెళితే చాలు. చూడ్డానికి బాగుంటాయి.

* పూల మధ్యలో మర్మం పెట్టి కడతాం కదా! అలాగే బంతి లేదా నచ్చిన పూలను తీసుకొని మధ్యలో మామిడాకులను చుట్టి గుచ్చుకుంటూ వెళ్లాలి. తర్వాత ఓ నాలుగైదు మామిడాకులను కాడలన్నీ ఒకేచోట వచ్చేలా పట్టుకొని కాడలకి కాస్త కింద ఓ పూవుతో కుట్టేయాలి. వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న పొడవైన దారానికి అక్కడక్కడా వచ్చేలా అమర్చుకుంటే సరి!

* పూలు, మామిడాకులతో మామూలుగానే తోరణాలను సిద్ధం చేసుకోవాలి. ఫొటోలో చూపినట్లు ఆకులమధ్యలో పువ్వు వచ్చేలా కొన్ని చిన్న దండలను సిద్ధం చేసుకొని తగిలించినా ఆకర్షణీయంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్