పసుపుతో పసిడితో… మెరుగు!

ఎంత మెరిసే నగలయినా రోజూ వేసుకుంటే మురికిపట్టి నల్లగా మారతాయి. వాటిని మెరుగు పెట్టించడానికి దుకాణానికి తీసుకెళ్తాం. అలా కాకుండా కిచెన్‌లో ఉపయోగించే పదార్థాలతో బంగారాన్ని శుభ్రం చేయటం ఎలాగో తెలుసుకుందామా..

Published : 24 Mar 2023 00:39 IST

ఎంత మెరిసే నగలయినా రోజూ వేసుకుంటే మురికిపట్టి నల్లగా మారతాయి. వాటిని మెరుగు పెట్టించడానికి దుకాణానికి తీసుకెళ్తాం. అలా కాకుండా కిచెన్‌లో ఉపయోగించే పదార్థాలతో బంగారాన్ని శుభ్రం చేయటం ఎలాగో తెలుసుకుందామా..

బంగాళదుంప నీళ్లతో.. బంగాళదుంపలను ఉడకబెట్టిన తర్వాత మిగిలిన నీళ్లు తీసుకొని చెంచా డిటర్జెంట్‌ పౌడర్‌ వేయాలి. దీంట్లో నగలను వేసి ఒక గంటపాటు నాననివ్వాలి. తర్వాత వాటిని టూత్‌ బ్రష్‌తో మృదువుగా రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి.

నిమ్మరసంతో.. ఒక నిమ్మకాయని పూర్తిగా రసం తీసుకొని దాంట్లో ఓ చిటికెడు పసుపు వేసి దాంట్లో నగలను ముంచాలి. అర్ధగంట నాననివ్వాలి తర్వాత కొద్దిగా గిన్నెలు కడిగే లిక్విడ్‌ రాసి, బ్రష్‌తో రుద్దాలి. చల్లటి నీళ్లలో శుభ్రం చేయాలి. అంతే బంగారు నగలు కాంతులీనుతాయి.

వేడినీళ్లతో.. గ్లాసుడు వేడినీళ్లలో చెంచా పసుపు,  చెంచా డిటర్జెంట్‌ పౌడర్‌ వెయ్యాలి. దాంట్లో నగలను వేసి అర్ధగంట నాననివ్వాలి. తర్వాత బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది, చన్నీళ్లతో కడగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్