రసాయనాల్లేకుండా శుభ్రం చేద్దాం...

ఇల్లు శుభ్రం చేసే క్రమంలో మంచి ఫలితం కోసం రకరకాల రసాయనాలు వాడతాం. అవి మన ఆరోగ్యానికే ముప్పు తెస్తాయని తెలుసా.. వీటికోసం ఇంట్లోనే సహజ క్లీనర్స్‌ తయారు చేసుకొని ఉపయోగించొచ్చు.. అవేంటో చూద్దామా..

Updated : 21 May 2023 05:17 IST

ఇల్లు శుభ్రం చేసే క్రమంలో మంచి ఫలితం కోసం రకరకాల రసాయనాలు వాడతాం. అవి మన ఆరోగ్యానికే ముప్పు తెస్తాయని తెలుసా.. వీటికోసం ఇంట్లోనే సహజ క్లీనర్స్‌ తయారు చేసుకొని ఉపయోగించొచ్చు.. అవేంటో చూద్దామా..

* పావు కప్పు బేకింగ్‌సోడాకు, పావుకప్పు వెనిగర్‌, కొద్దిగా లావెండర్‌ ఆయిల్‌ కానీ టీ ట్రీ ఆయిల్‌ కానీ కలుపుకోవాలి. దీంతో టాయ్‌లెట్‌ని శుభ్రం చేసుకుంటే మరకలు వదిలిపోవటమే కాదు చక్కటి సువాసన కూడా వస్తుంది.

* వంట గట్టు శుభ్రంగా లేకపోతే దాని చుట్టూ ఈగలు, నుసుములు ముసురుతాయి. అక్కడలా చిరాకుగా ఉంటే ప్రశాంతంగా వంట కూడా చేయలేం. రెండు కప్పుల నీళ్లకు అరకప్పు బేకింగ్‌ సోడా కలపాలి. ఈ మిశ్రమం గ్రానైట్‌, కౌంటర్‌ టాప్స్‌, ఫ్లోర్‌ తుడిచేందుకు బాగా ఉపయోగపడుతుంది.

* కప్పు వెనిగర్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి మైక్రోఅవెన్‌లో స్ప్రే చేయాలి. తర్వాత తడి వస్త్రంతో తుడవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జిడ్డు మరకలు పేరుకోకుండా ఉంటాయి. ఆహారాన్ని వండేప్పుడు రసాయనాలు చేరతాయనే భయం ఉండదు. మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిజ్‌లు వంటి వాటిని శుభ్రం చేసేందుకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్