పాతవే.. కొత్తగా!

మన బీరువాలో ఎన్ని రకాల దుస్తులు ఉన్నా... కొత్త దుస్తులు కొంటున్నా కూడా....ఏదో లేదనే ఆసంతృప్తి చాలామంది అమ్మాయిలకు. ఎందుకిలా అంటే ఎప్పుడూ కొత్తదనం కోరుకోవడమే అసలు కారణం. డబ్బులు వృథాకాకుండా ఉన్నవాటినే కొత్తగా మార్చుకునే ప్రయత్నం చేస్తే... ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Published : 23 May 2023 00:40 IST

మన బీరువాలో ఎన్ని రకాల దుస్తులు ఉన్నా... కొత్త దుస్తులు కొంటున్నా కూడా....ఏదో లేదనే ఆసంతృప్తి చాలామంది అమ్మాయిలకు. ఎందుకిలా అంటే ఎప్పుడూ కొత్తదనం కోరుకోవడమే అసలు కారణం. డబ్బులు వృథాకాకుండా ఉన్నవాటినే కొత్తగా మార్చుకునే ప్రయత్నం చేస్తే... ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అదెలా అంటారా?

మీ బీరువాలోని దుస్తులన్నీ బయటకు తీయండి. అప్పుడెప్పుడో రంగు నప్పలేదనో, డిజైన్‌ బాలేదనో కొన్నరోజునే మూలన పడేసిన దుస్తులూ బయటపడతాయి. అప్పట్లో నచ్చనివి కాస్తా ఇప్పుడు మీరు మెచ్చొచ్చు. వాటిని అచ్చంగా అలానే వేసుకోనక్కర్లేదు. అప్పట్లో కొన్న టాప్‌కి జతగా ఓ కలంకారీ జాకెట్‌ని ఎంచుకోండి. లేదా పొడవు చేతుల్ని కాస్తా స్లీవ్‌లెస్‌ చేసేయండి. మీకూ పాతదే అన్న భావన రాదు.

నిన్నమొన్నటి వరకూ దుస్తుల్ని ఒకే రంగులో నప్పేలా ఎంచుకోవడం ఫ్యాషన్‌. ఇప్పుడు వేటికవే భిన్నంగా ఉండేలా చూసుకోవడం ప్రత్యేకత. అలాంటి ముదురూ, లేత వర్ణాల కలయితో పాటు ఓంబ్రీ రంగుల హంగామా కూడా ఉండేలా చూసుకోవచ్చు. ఇవన్నీ  కొత్తదనం తెచ్చేవే.

పాత దుస్తుల్నే కాస్త కొత్తగా కూడా వేసుకోవచ్చు. వాటికి అదనంగా ప్యాచ్‌లు అతికించడం, అద్దాలు కుట్టుడం, అంచుల్లో లేస్‌లూ, కేప్‌లు వంటివి జత చేసుకుని కొత్తగా కనిపించేలా చేయొచ్చు. అలానే పాత దుపట్టాలు కొన్ని కొత్తగానే ఉంటాయి. వాటిల్లో బెనారస్‌ వంటి జరీ అంచులున్నవాటిని ఎంచుకోవాలి. వాటిని క్రాప్‌టాప్‌లుగానూ కుట్టించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్