సహజంగా కలుపు దూరం!

చినుకులు పడుతున్నాయి. గార్డెనింగ్‌ని ఇష్టపడేవారు రకరకాల విత్తనాలు, మొక్కలతో సిద్ధమైపోతారు. సమస్యల్లా కలుపు మొక్కలతోనే! వీటినీ ఇప్పుడే తీసేస్తే మేలు కదూ!

Published : 28 Jun 2023 00:37 IST

చినుకులు పడుతున్నాయి. గార్డెనింగ్‌ని ఇష్టపడేవారు రకరకాల విత్తనాలు, మొక్కలతో సిద్ధమైపోతారు. సమస్యల్లా కలుపు మొక్కలతోనే! వీటినీ ఇప్పుడే తీసేస్తే మేలు కదూ! రసాయనాలొద్దంటే సహజంగానూ ప్రయత్నించొచ్చు ఇలా..

  • చినుకులు పడగానే పాదులు చేసుంటారుగా! ఆ మట్టితో కలుపు మొక్కలను కప్పేయండి. ఎదగడానికి వాటికి సూర్యరశ్మి కావాలి. అది దొరక్కపోతే చనిపోతాయి. అయితే కాస్త మందంగా మట్టితో కప్పగలగాలి మరి. లేదూ మందమైన పేపర్లతో కప్పినా మంచిదే.
  • జిడ్డు, నూనె మరకలకు వెనిగర్‌పై ఎక్కువగా ఆధారపడుతుంటాం. పిచ్చి మొక్కల విషయంలోనూ దీని సాయం తీసుకోవచ్చని తెలుసా? దీనిలోని ఎసిటిక్‌ యాసిడ్‌ కలుపు మొక్కల్లోని తేమను తీసేసి, చనిపోయేలా చేయగలవు. బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ మొక్కలపై వెనిగర్‌తో పిచికారీ చేయండి. కొన్నిరోజుల్లోనే చనిపోతాయి.
  • సమాన పరిమాణాల్లో లిక్విడ్‌ డిష్‌వాష్‌, వెనిగర్‌, ఉప్పు తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కలుపు మొక్కలపై పిచికారీ చేసి కూడా వాటి బాధ వదిలించుకోవచ్చు.
  • ఉప్పు తీసుకొని కలుపు మొక్కలపై కాస్త మందంగా చల్లి చూడండి. సమస్య దెబ్బకు దూరం. అసలే వర్షాకాలం.. కరిగి వేరే మొక్కలకీ ఉప్పు నీరు చేరొచ్చు. ఇది వాటిపైనా దుష్ప్రభావం చూపగలదు. కాబట్టి.. నీరు పారినా వేరే మొక్కలపై ప్రభావం పడదన్నప్పుడే దీన్ని పాటించడం మేలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్