అతిగా రుద్దేయకండి...

నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేయడం సులువు. కడగడం కూడా సౌకర్యం... అంటూ చాలామంది ఈ తరహావి వాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

Published : 06 Jul 2023 00:03 IST

నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేయడం సులువు. కడగడం కూడా సౌకర్యం... అంటూ చాలామంది ఈ తరహావి వాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, వీటిని సరిగా ఉపయోగించకపోతే.... పైన వేసే టెఫ్లాన్‌ కోటింగ్‌ కరిగి అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందంటారు నిపుణులు.

నాన్‌స్టిక్‌ పాత్రల్ని వాడే ముందు కాస్త బేకింగ్‌ సోడా వేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వీటిల్లో పేరుకున్న రసాయనాల తాలూకు వ్యర్థాలు తొలగిపోతాయి. అయితే ప్రతి వంటకానికీ నాన్‌స్టిక్‌ పాత్రలను వాడకుండా అడుగంటే వేపుళ్లూ, కూరల కోసం మాత్రమే ఎంచుకుంటే మేలు. అప్పుడే ఎక్కువకాలం మన్నుతాయి.

  • ఎక్కువ మంటపై పెడితే వేడికి నాన్‌స్టిక్‌ పాత్రల్లో వాడే టెఫ్లాన్‌ కోటింగ్‌ పోతుంది. వీలైనంత తక్కువ మంటమీదే వీటిల్లో ఉడికించాలి. ఈ పాత్రల్లో వండే పదార్థాలను కలిపేందుకు ప్లాస్టిక్‌ లేదా చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. ఇనుము, స్టీల్‌, ఇత్తడి గరిటెలను వాడితే గీతలు పడి వంట చేయడానికి పనికి రాకుండా పోతాయి.
  • ఈ పాత్రలను శుభ్రపరిచేందుకు స్టీల్‌, ప్లాస్టిక్‌ పీచులను వాడకూడదు. ఎక్కువ ఘాటుగా ఉండే క్లీనింగ్‌ పౌడర్‌లను కూడా ఉపయోగించకూడదు. బలంగా రుద్దడం, తోమడం చేసినా పూత పోతుంది. వీలైనంత వరకూ వేడి నీళ్లు, లిక్విడ్‌ సోప్‌లతో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. ఆపై పొడివస్త్రంతో తుడిచి కాస్త నూనె రాసి భద్రపరుచుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్