హడావుడి లేకుండా..

రమణి ఉదయం పూట త్వరత్వరగా పనులు ముగించడానికి ప్రయత్నిస్తూ.. పొయ్యి దగ్గర వేడిగా ఉన్న పాత్రను పట్టుకొని చేయి కాల్చుకుంటుంది. నిండుగా ఉన్న సాంబారు గిన్నెను జారవిడుస్తుంది.

Published : 08 Jul 2023 00:18 IST

రమణి ఉదయం పూట త్వరత్వరగా పనులు ముగించడానికి ప్రయత్నిస్తూ.. పొయ్యి దగ్గర వేడిగా ఉన్న పాత్రను పట్టుకొని చేయి కాల్చుకుంటుంది. నిండుగా ఉన్న సాంబారు గిన్నెను జారవిడుస్తుంది. ఇలా హడావుడిగా పనులు చేస్తే ఏదీ సవ్యంగా పూర్తికాదని, ప్రణాళికగా పూర్తిచేస్తేనే మంచిదంటున్నారు నిపుణులు..

వంటపని, పిల్లలను స్కూల్‌కు పంపడం, ఆఫీసుకెళ్లడం వంటివన్నీ కంగారును పుట్టిస్తాయి. సకాలంలో పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానం మరింత వేగంగా పరుగుపెట్టేలా చేస్తాయి. ఇదంతా మెదడుపై చెడు ప్రభావాన్ని పడేలా చేస్తుంది. మరుసటి రోజు చేయాల్సిన వంటకాల కోసం కూరగాయలు, ఆకుకూరలను వీలైతే రాత్రే కోసి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఉదయం పిల్లలకు కావాల్సిన యూనిఫాం, లంచ్‌ బాక్సులు వంటివన్నీ ఒకచోట ఉంచితే కావాల్సినప్పుడు ఎదురుగా కనిపిస్తాయి. ముఖ్యంగా వేకువ జామున నిద్రలేస్తే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ప్రశాంతంగా పనులు పూర్తిచేసుకొనే అవకాశం ఉంటుంది.

తీసిన చోటే.. ఇంట్లో వస్తువు తీసిన చోటే ఉంచే అలవాటును ప్రతి ఒక్కరికీ నేర్పాలి. పిల్లలకు బాల్యం నుంచి దీన్ని అలవాటు చేయాలి. టూత్‌బ్రష్‌, పేస్టు నుంచి తువ్వాలు, దువ్వెన, పౌడర్‌, పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్‌, సూది, దారం, టీవీ రిమోట్‌, బండి తాళాలు, ఇంటి లాక్‌కు వాటికంటూ ప్రత్యేకంగా స్థానాల్ని కేటాయించాలి. వాటిని అవసరార్థం తీసినా తిరిగి యథాస్థానాల్లో ఉంచడం పెద్దవాళ్లు ముందుగా పాటిస్తే క్రమేపీ పిల్లలూ నేర్చుకుంటారు. అత్యవసరానికి వస్తువులను వెతకడంలో సమయం వృథా కాదు. హడావుడి లేకుండా అనుకున్నవన్నీ పూర్తిచేయొచ్చు.

వంటకు..  కూరల్లో వేసే మసాలాలు, వేపుళ్లలో వేసే పౌడర్లను నెలకొకసారి తయారు చేసుకొని పొడి సీసాలో భద్రపరుచుకోవచ్చు. వెల్లుల్లి పాయలను విడదీసి గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌ డోర్‌లో ఉంచొచ్చు. అరకేజీ చింతపండును శుభ్రపరిచి నీటిని కలిపి చిక్కగా ఉడికించి చల్లార్చి భద్రపరిస్తే నెలకు సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్