ఈగల బెడదా.. ఇలా చెయ్యండి

వర్షాకాలం వచ్చిందంటే ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం, తాగే నీళ్లపై కూడా ఇవి వాలుతుంటాయి. తర్వాత ఆనారోగ్యల పాలవుతుంటాం.

Published : 23 Jul 2023 00:16 IST

వర్షాకాలం వచ్చిందంటే ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం, తాగే నీళ్లపై కూడా ఇవి వాలుతుంటాయి. తర్వాత ఆనారోగ్యల పాలవుతుంటాం. రాకుండా గుమ్మాలకు, కిటికీలకు మెస్‌లు వేస్తుంటాం కానీ ఏదోక సమయంలో ఇవి లోపలికి వస్తుంటాయి. ఇంకా వీటిని తరిమి కొట్టడానికి రకరకాల స్ప్రేలను వాడుతుంటాం. వాటికి బదులుగా ఇంట్లోనే సహజసిద్ధంగా మనం తయారు చేసుకోవచ్చు.

వంటలో సువాసన కోసం ఉపయోగించే బిర్యానీ ఆకుతో కూడా ఈగలను వదిలించుకోవచ్చు. బిర్యానీ ఆకులను కాల్చి ఆ పొగని ఇల్లంతా వ్యాపించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఇల్లంతా సువాసన వస్తుంది. ఈగలు బయటికి పోతాయి.

 ఇంటి నుంచి ఈగలను పారదోలడంలో కర్పూరం ప్రభావవంతంగా పని చేస్తుంది. పది పచ్చకర్పూరం బిళ్లలను తీసుకుని పొడి చేసుకోవాలి. దీనిని లీటరు నీటిలో కలిపి స్ప్రే బాటిల్లో వేసి ఈగలు వాలే చోట స్ప్రే చేస్తే చాలు. సమస్య తొలగిపోతుంది.

 కొన్ని తులసి ఆకులని తీసుకుని మెత్తని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి పిచికారి చేస్తే ఈగల బెడద ఉండదు.

 ఈగల నియంత్రణకు వెనిగర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఓ గిన్నెలో యాపిల్‌సిడార్‌ వెనిగర్‌ తీసుకుని దానికి రెండు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ కలపాలి. ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తే సరి.

 దాల్చినచెక్కను పొడి చేసి ఇంట్లో మూలల్లో ఉంచితే ఆ వాసనకి ఈగలు దరి చేరవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్