మెట్లపై అడవులు.. జలపాతాలు

ఆ మెట్లపై అడుగుపెట్టాలంటే అక్కడ ప్రవహిస్తున్న నీటిలో జారిపోతామనిపిస్తుంది. అలాగే మెట్లకింద విరబూసిన పూల తోటలు చూస్తే పట్టరాని ఆనందం కలుగుతుంది. ఇవన్నీ నిజమనుకొంటే పప్పులో కాలేసినట్లే.

Updated : 25 Jul 2023 05:56 IST

ఆ మెట్లపై అడుగుపెట్టాలంటే అక్కడ ప్రవహిస్తున్న నీటిలో జారిపోతామనిపిస్తుంది. అలాగే మెట్లకింద విరబూసిన పూల తోటలు చూస్తే పట్టరాని ఆనందం కలుగుతుంది. ఇవన్నీ నిజమనుకొంటే పప్పులో కాలేసినట్లే. ఆ కనికట్టు ఏంటో చూద్దాం..

ది గోడలపై ప్రకృతి చిత్ర లేఖనాలు, పోస్టర్లను అద్ది ఇంటి అందాన్ని పెంచడం మామూలు విషయమే. ప్రస్తుతం ఆ అందాలను మెట్లపైనా పరుస్తున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఇంటిలోపలి నుంచి పై అంతస్తుకెళ్లే వాటికి రకరకాల అందాలను అద్దుతున్నారు. ఇవే ‘స్టెయిర్‌ స్టిక్కర్స్‌’. సహజసిద్ధంగా అనిపించే పూలతోటలు, జలపాతాలు, కొండలూ, గుట్టలూ, రోడ్లు, పర్వతమార్గాలు, జలాశయాలు, తామరలు నిండిన సరోవరాలు.. ఇలా ఎన్నో మన అభిరుచికి తగ్గట్టు ఎంచుకోగలిగితే చాలు. ప్రకృతి అంతా చెంత ఉన్నట్లే. మెట్లపై అటాచ్‌ చేసే ఈ స్టిక్కర్ల అందంతో మనసు నిండిపోతుంటే అక్కడే కూర్చొని సేద తీరాలనిపించేలా మెట్లు కనికట్టు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్