అటకెక్కించొద్దు.. అందంగా మారుద్దాం!

అమ్మమ్మ, నానమ్మ వాడిన ఇత్తడి మరచెంబు, రాగి టీ కెటిల్‌, గ్లాసు, పూలసజ్జ వంటివన్నీ అటకెక్కించారా? వెంటనే కిందకు దింపండి.

Published : 26 Jul 2023 00:25 IST

అమ్మమ్మ, నానమ్మ వాడిన ఇత్తడి మరచెంబు, రాగి టీ కెటిల్‌, గ్లాసు, పూలసజ్జ వంటివన్నీ అటకెక్కించారా? వెంటనే కిందకు దింపండి. ఇప్పుడు గృహాలంకరణలో వీటిదే ట్రెండు...

పాత ఇత్తడి గ్లాసులను సేకరించి చింతపండు, ఉప్పు మిశ్రమంతో శుభ్రం చేయండి. మిలమిల మెరిసే వాటిని నీటితో నింపి పెరట్లో విరిసిన గోవర్ధనం లేదా మందార పూల కొమ్మలను సర్దేయండి. హాల్‌లో వినాయకుడు, బుద్ధుడు ప్రతిమల పక్కన ఈ గ్లాసు ఉంచితే చాలు. ఇల్లంతా తాజాదనం నిండినట్లు అనిపిస్తుంది.

మరచెంబు కాదది..

ఇత్తడి, రాగి మరచెంబులు ఇంటి అందాన్ని భలే పెంచేస్తాయి. వీటిలో నీటిని నింపి బంతి, చామంతి, జర్బరా వంటి పూలను నిండుగా, విచ్చుకున్నట్లు సర్దాలి. దీన్ని టీపాయిపై ఉంచి చూడండి. అలాగే పొడవైన కాడలున్న పూలను కూడా ఈ మరచెంబుల్లో ఉంచి భోజనాల బల్లపై అందంగా అమర్చేయండి. పాత వస్తువు కొత్తగా కనిపించడం ఖాయం.

టీ కెటిల్‌..

దీనిలో సన్న కాడలున్న పూల కొమ్మలను వదులుగా సర్ది నీటితో నింపితే చాలు. గదికే ప్రత్యేకతను తెస్తుంది. అలాగే అలనాటి పూలసజ్జలెన్నో ఇత్తడి, స్టీలువి వృథాగా ఉంచుతాం. వీటిని శుభ్రపరిచి హాల్‌లో టీపాయ్‌పై అలంకరణగా మార్చేయొచ్చు. వీటిలో చిన్న ఇండోర్‌ప్లాంట్‌ తొట్టె ఉంచి మధ్యలో మనసుకు నచ్చిన బుద్ధుడు లేదా వినాయకుడి బొమ్మను, చుట్టూ పూలను ఉంచండి. ఎంత కళగా ఉంటుందో ఇల్లు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్