ఇల్లే.. పూల వనంలా

మొక్కలను మించిన శోభ ఇంటికి మరొకటుండదు. తీగలూ లతలూ ఇంటి మీదా, కాంపౌండ్‌ వాల్‌ మీదా అల్లుకుపోతే.. ఇక ఆ అందాన్ని చెప్పడానికి మాటలెక్కడ సరిపోతాయి? మీరూ అలా పెంచుకోవాలనుకుంటే వీటిని ప్రయత్నించండి...

Published : 01 Aug 2023 00:40 IST

మొక్కలను మించిన శోభ ఇంటికి మరొకటుండదు. తీగలూ లతలూ ఇంటి మీదా, కాంపౌండ్‌ వాల్‌ మీదా అల్లుకుపోతే.. ఇక ఆ అందాన్ని చెప్పడానికి మాటలెక్కడ సరిపోతాయి? మీరూ అలా పెంచుకోవాలనుకుంటే వీటిని ప్రయత్నించండి...

కాగితప్పూల చెట్టు గురించి చెప్పాల్సిందేముంది?! తెలుపు, గులాబీ, గంధం రంగు, ఎరుపు.. ఇలా అనేక రంగుల్లో సొగసులు కురిపిస్తాయి. ఆకుల కంటే సుమాలే ఎక్కువనిపించేలా విరబూసి సోయగాలు పోతాయి. ఈ బోగన్‌విల్లా చెట్టును గనుక ఇంటి మీదికి ఏర్పాటు చేసుకున్నామంటే ఇక ఇల్లు పూలవనంలా కనిపిస్తూ ముచ్చటేస్తుంది.

 తెలుపు, లేత గులాబీ కలగలసిన పూలతో గుత్తులు గుత్తులుగా పూసే మధుమాలతి పేరుకు తగ్గట్టే మధురంగా ఉంటుంది. గోడలు లేదా ఫెన్సింగుకు పాకించండి. ఇల్లు అందాల పొదరిల్లులా మారుతుంది.

 చక్కటి పరిమళాలు వెదజల్లే నీలి రంగు పూల బెంగాల్‌ క్లాక్‌ వైన్‌ను చాలామంది మక్కువగా పెంచుకుంటారు. గడియారం ముల్లు తిరిగినట్టే గుండ్రంగా అల్లుకుంటుంది. ఇది ఏడాది పొడవునా పుష్పిస్తుంది. కాబట్టి,  ఇల్లు ఎప్పుడూ శోభాయమానంగానే ఉంటుంది.

 లావెండర్‌ గురించి చెప్పాల్సిందేముంది? దీని పెంపకానికి ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులేమీ అవసరం లేదు. గాలీ వెలుతురూ తగిలితే చాలు. అల్లుకుపోయి ఊదా రంగు పూల గుత్తులతో సువాసనలు గుప్పిస్తూ సొగసులందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్