మరకలు పోగొట్టే గ్లిజరిన్‌!

గ్లిజరిన్‌ని సౌందర్య ఉత్పత్తుల్లోనే వాడతారని తెలుసు? కానీ, దీంతో మరెన్నో ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.

Published : 03 Aug 2023 00:07 IST

గ్లిజరిన్‌ని సౌందర్య ఉత్పత్తుల్లోనే వాడతారని తెలుసు? కానీ, దీంతో మరెన్నో ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి..

  • ఈ కాలంలో తాళాలు సరిగా పడవు. ఇలాంటప్పుడు తాళం చెవి రంధ్రంలో రెండు చుక్కల గ్లిజరిన్‌ వేస్తే సరి.
  • వాజులోని పూలు ఎక్కువ కాలం తాజాగా, సువాసనతో ఉండాలంటే ఆ నీటిలో రెండు చుక్కల గ్లిజరిన్‌ కలిపి చూడండి.
  • చెక్క కిటికీలపై దుమ్ము వల్ల మరకలు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు పొడివస్త్రంపై కాస్త గ్లిజరిన్‌ వేసి తుడిస్తే త్వరగాపోతాయి.
  • టైల్స్‌ మురికిగా, కళ తప్పినట్లు కనిపిస్తుంటే బకెట్‌ నీళ్లల్లో రెండు కప్పుల గ్లిజరిన్‌ వేసి తుడవాలి.
  • లెదర్‌ వస్తువులు, బ్యాగులను దీంతో తుడిస్తే తేమను చేరనివ్వదు. పాడవకుండా కాపాడుతుంది.  మరకలు పడితే గ్లిజరిన్‌తో రెండు మూడు సార్లు రుద్దితే త్వరగా పోతాయి.
  • రిఫ్రిజిరేటర్‌లో తలుపు చుట్టూ ఉండే రబ్బరును గ్లిజరిన్‌తో తుడవడం వల్ల  సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది.
  • మిగిలిపోయిన సబ్బు ముక్కలన్నింటినీ ఓ సీసాలో వేయండి. దానిలో కాస్త నీళ్లూ, కొద్దిగా గ్లిజరిన్‌ వేస్తే హ్యాండ్‌ వాష్‌లా కూడా వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాటిల్‌లో వేసి పిల్లలకు ఇస్తే చక్కగా గాలి బుడగలు ఊదుకుంటారు.
  • దుస్తులపై మరకలను పోగొట్టడంలోనూ గ్లిజరిన్‌ సాధారణ డిటర్జెంట్ల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్