నల్లబియ్యంతో ఆరోగ్యం!

నల్లబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించి.. వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. 

Published : 06 Aug 2023 01:10 IST

నల్లబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించి.. వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి.  ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లని నియంత్రిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి..

గుండె ఆరోగ్యం.. నల్లబియ్యం చెడు కొవ్వులను కరిగించడంలో సాయపడుతుంది. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరిగి హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

చర్మం సౌందర్యం.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి ముడతలు తగ్గించి, కాంతిమంతంగా మారుస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని నివారిస్తాయి.

కంటిచూపు.. నల్లబియ్యం కంటిచూపు మెరుగుపరడంలో సాయపడుతుంది. రెటీనా దెబ్బతినకుండా చూస్తుంది.

బరువు..  ఈ బియ్యంలో పీచు ఎక్కువ.  దాంతో కడుపు నిండుగా అనిపించి ఇతర పదార్థాలపై దృష్టిమళ్లదు. బరువు అదుపులో ఉంటుంది.

అలెర్జీ.. నల్లబియ్యంలోని యాంటీమైక్రోబియల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చేస్తాయి.

రక్త హీనత..  రోజువారీ అవసరాల్లో.. 60 శాతం ఐరన్‌ నల్లబియ్యం తినడం వల్ల లభిస్తుంది. రక్తహీనత రాకుండా ఉంటుంది.

చక్కెర నియంత్రణ.. నల్లబియ్యంలో యాంటీ క్యాన్సర్‌ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కణాలను పెరగకుండా అడ్డుకుంటాయి. చక్కెర వ్యాధి ఉన్నవారు వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్