నిద్ర పట్టట్లేదా...

పని ఒత్తిడి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, మారుతున్న జీవనశైలి మనల్ని మంచి నిద్రకు దూరం చేస్తున్నాయ్‌! కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు..

Updated : 12 Aug 2023 12:53 IST

పని ఒత్తిడి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, మారుతున్న జీవనశైలి మనల్ని మంచి నిద్రకు దూరం చేస్తున్నాయ్‌! కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు..

రాత్రి సమయంలో ఎక్కువసేపు ఎలక్ట్రానిక్‌  పరికరాలతో గడుపుతున్నారా? వీటి నుంచి వెలువడే నీలి కాంతి కంటికి హాని చేసి నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. అందువల్ల నిద్రపోయే గంటముందు సెల్‌ఫోన్‌ పక్కన పెట్టేయాలి.

మంచి నిద్రకోసం వ్యాయామం కూడా అవసరం. ఇది శరీరంలో సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచి మెదడుని తేలిక పరుస్తుంది. ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది.

నిద్రలేమితో బాధపడే వారు స్లీప్‌ షెడ్యూల్‌ని అలవాటు చేసుకోవాలి. కొద్దిరోజులపాటు ఫలానా సమయానికే నిద్రించాలి అనే నియమం పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే అలవాటుగా మారి చక్కని నిద్ర పడుతుంది.

రాత్రుళ్లు మీరు తీసుకునే ఆహారం కూడా నిద్రలేమికి దారితీయొచ్చు. మసాలాలు, వేపుళ్లు వంటి వాటికి దూరంగా ఉండాలి.

టీ, కాఫీ, శీతల పానీయాలు ఎక్కువగా తాగకూడదు. ఒకవేళ తాగితే నిద్రకు ఆరు గంటల ముందే తీసుకోవాలి.

  యోగా, మెడిటేషన్‌ వంటివి కూడా నిద్రలేమిని తగ్గిస్తాయి. వీటితో మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి కునుకు పట్టేలా సాయపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్