పరిమళం పలకరించేలా!

ఇంటిని సువాసన భరితంగా మార్చడానికి ఫ్రెషనర్లు, అగరబత్తులు వంటివెన్నో ఉన్నా... వాటిలో ఏవి సహజమైనవో, ఏవి రసాయన ఉత్పత్తులో తెలియదు. అయితే, మనముండే వాతావరణాన్ని కాలుష్యరహితంగా సహజ పరిమళాలతో నింపేయాలంటే ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

Published : 13 Aug 2023 00:14 IST

ఇంటిని సువాసన భరితంగా మార్చడానికి ఫ్రెషనర్లు, అగరబత్తులు వంటివెన్నో ఉన్నా... వాటిలో ఏవి సహజమైనవో, ఏవి రసాయన ఉత్పత్తులో తెలియదు. అయితే, మనముండే వాతావరణాన్ని కాలుష్యరహితంగా సహజ పరిమళాలతో నింపేయాలంటే ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

చామంతి, గులాబీ, లిల్లీ, సంపెంగ... ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన పరిమళం ఇష్టం. మీకు నచ్చిన పూలను ఎంచుకోండి. వీటిని నీడన ఆరబెట్టి ఓ గాజు సీసాలో వేయండి. ఇందులోనే ఓ దాల్చిన చెక్క, కాసిన్ని నిమ్మ తొక్కలు కూడా చేర్చండి. మూతకు చిన్న చిన్న రంధ్రాలు చేసి గదిలో ఓ మూల ఉంచితే సరి. వాటి నుంచి వెలువడే సువాసనలు మనసుకి హాయినిస్తాయి.

సువాసననిచ్చే గులాబీలు, లిల్లీలు, నందివర్థనాలు... ఇలా పూలన్నింటినీ సేకరించి వేటికవి రేకలను విడదీసి నీడలో ఆరబెట్టాలి. వీటితో పాటు దవనం, మరువం వంటి ఆకులనూ ఇలానే చేసి భద్రపరుచుకోవచ్చు. మీకు నచ్చిన రకాల్ని ఓ గాజు సీసాలో వేసి అందులో కాస్త ఎప్సమ్‌ సాల్ట్‌ కూడా కలపండి. పైన కొంచెం మీకు నచ్చిన ఎసెన్షియల్‌ నూనె రెండు చుక్కలు వేసి బాగా కలపాలి. అప్పుడు కొద్దికొద్దిగా జిప్‌లాక్‌ కవర్లలోకి తీసుకుని అక్కడక్కడా రంధ్రాలు చేసి దుస్తుల బీరువాలోనూ, ముక్క వాసన వచ్చే చోట పెట్టండి.

నిమ్మ, నారింజ వంటి పండ్ల వాసన మనసుని తేలిక పరుస్తుంది. మరువం, తులసి ఆకులు, నారింజ తొక్కలు, దాల్చిన చెక్క వంటివన్నీ నీళ్లల్లో వేసి బాగా మరిగించండి. చల్లారాక నీళ్లను వడకట్టుకుని ఓ సీసాలో పోసుకోండి. దుర్వాసనలు వచ్చేప్పుడు స్ప్రే బాటిల్లోకి తీసుకుని గాల్లోకి చల్లితే సమస్య దూరమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్