వాటితో పాత్రలు శుభ్రం...

ఇల్లాలికి.. వంటగిన్నెలు శుభ్రం చేయనిదే పని పూర్తవ్వదు. అయితే, ఒక్కోసారి ముందు చూసుకోకపోవడం వల్ల వాటిని తోమే సబ్బు అయిపోయి ఉండొచ్చు. ఇలాంటప్పుడు కంగారక్కర్లేదు. ఈ ప్రత్యామ్నాయాల్ని ఉపయోగించండి..

Published : 23 Aug 2023 01:59 IST

ఇల్లాలికి.. వంటగిన్నెలు శుభ్రం చేయనిదే పని పూర్తవ్వదు. అయితే, ఒక్కోసారి ముందు చూసుకోకపోవడం వల్ల వాటిని తోమే సబ్బు అయిపోయి ఉండొచ్చు. ఇలాంటప్పుడు కంగారక్కర్లేదు. ఈ ప్రత్యామ్నాయాల్ని ఉపయోగించండి..

  • జిడ్డు, సూక్ష్మక్రిములు లేకుండా పాత్రల్ని శుభ్రం చేయడానికి బేకింగ్‌ సోడా చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో కాసిని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసి ఈ మిశ్రమంలో అద్దిన పీచుతో పాత్రల్ని రుద్దితే సరి. వ్యర్థాలు సులువుగా వదిలిపోతాయి.
  • బియ్యం కడిగిన నీళ్లతో అంట్ల గిన్నెలను ఓ అరగంట నాననిచ్చి ఆపై పీచుతో రుద్దితే సరి. అయితే, గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే ఆ కడుగు వాసన రాకుండా ఉంటుంది. ఇందులో సిట్రిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల జిడ్డు సులువుగా వదిలిపోతుంది.  
  • మూడు టేబుల్‌ స్పూన్ల బేకింగ్‌ సోడాకు అరచెక్క నిమ్మరసం పిండి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ముంచిన పీచుతో గిన్నెల్ని తోమితే తళతళా మెరుస్తాయి.
  • గిన్నెలు తోముకునే సబ్బులేకపోతేనేం ఉప్పు ఉంది కదా! పాత్రల మీద కాస్తంత టేబుల్‌ సాల్ట్‌ చల్లుకుని గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఉప్పు....గిన్నెలపైనున్న క్రిములని దూరం చేస్తుంది. వీలైతే దానికి కాస్త బూడిదనో, ఇసుకనో జతచేసుకుంటే జిడ్డు వదిలిపోతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్