వందే వినాయకీ!

లోక కల్యాణార్థం అనేక పురుష దేవుళ్లు స్త్రీరూపం దాల్చినట్లు పురాణాల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా సుయుక్ష అనే రాక్షసిని సంహరించేందుకు మహిళా రూపంలో అవతరించాడనే ప్రచారం ఒకటి ఉంది.

Updated : 05 Oct 2023 16:13 IST

లోక కల్యాణార్థం అనేక పురుష దేవుళ్లు స్త్రీరూపం దాల్చినట్లు పురాణాల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా సుయుక్ష అనే రాక్షసిని సంహరించేందుకు మహిళా రూపంలో అవతరించాడనే ప్రచారం ఒకటి ఉంది. అలానే, పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసురుడి రక్తబిందువులు దేవతలపై పడి, ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయనీ, అలా వినాయకుడి నుంచి వినాయకి అవతరించిందనీ మరో కథనం చెబుతోంది. ఈ స్త్రీ రూప వినాయకుడు 64 మంది యోగినుల్లో ఒకరని కూడా చెబుతారు. ఈ మూర్తినే గజానని, వినాయకి, విఘ్నేశ్వరి, గణేశిని, గణేశ్వరి అనే పేర్లతో పిలుస్తారు. వ్యాఘ్ర (పులి) పాద గణపతి అని కూడా అంటారు. ఎందుకంటే, వినాయకి తల భాగం ఏనుగు తలలా, మెడ నుంచి నడుము వరకు స్త్రీమూర్తిలా, నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్ర (పులి) పాదాల రూపంలోనూ కనిపిస్తాయట. ఇటువంటి విగ్రహాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని రిగ్యాన్‌లో వినాయకి విగ్రహం కనిపిస్తుంది. అలానే రాజస్థాన్‌లోని జయపుర, షార్టీనగర్‌లోనూ అందమైన విఘ్నేశ్వరి విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ మ్యూజియంలో, ఒడిశాలోని షేర్‌పుర్‌, దక్షిణాదిన సుచీంద్రం, నాగర్‌ కోవిల్‌ క్షేత్రాల్లోనూ గణేశిని రూపంలో గణనాయకుడు కొలువై ఉన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్