అలంకరణ.. పిల్లల వంతు!

పండగంటే ఎన్ని పనులు! అన్నీ మనమీదే వేసుకుంటే పని భారానికి తోడు అలసట. పిల్లలకి ఎలాగూ సెలవే. ఈసారి అలంకరణ వారికి అప్పగించండి. అడపాదడపా సలహాలిస్తే చాలు.. ఈ చిన్ని చేతులూ అద్భుతాలను సృష్టించేయగలవు. రంగు రంగుల కాగితాలు ఇచ్చి అమ్మవారి రూపాలను గీయమనండి.

Updated : 23 Oct 2023 03:49 IST

పండగంటే ఎన్ని పనులు! అన్నీ మనమీదే వేసుకుంటే పని భారానికి తోడు అలసట. పిల్లలకి ఎలాగూ సెలవే. ఈసారి అలంకరణ వారికి అప్పగించండి. అడపాదడపా సలహాలిస్తే చాలు.. ఈ చిన్ని చేతులూ అద్భుతాలను సృష్టించేయగలవు.

రంగులు, పూసలతో.. రంగు రంగుల కాగితాలు ఇచ్చి అమ్మవారి రూపాలను గీయమనండి. మరీ చిన్న పిల్లలైతే అమ్మవారి వివిధ రూపాలను జిరాక్స్‌ తీసిచ్చి, రంగులు వేయమనండి. పూసలు, భిన్న రంగుల రాళ్లు, జిగురు ఇచ్చి, రూపానికి అనుగుణంగా అతికించమంటే సరి. పీఠాన్ని ఉంచే గోడకు వీటిని అతికిస్తే సరి. చూడచక్కగా ఉంటాయి. పండగయ్యాక వాటిని చిన్న ఫ్రేముల్లో పెడితే వాళ్లకీ ప్రోత్సాహంగా ఉంటుంది.

ముస్తాబు.. కాస్త పెద్ద తరగతుల పిల్లలైతే పీఠం బాధ్యతా అప్పగించేయొచ్చు. కొన్ని చున్నీలు.. పూల మాలలు, విడిపూలు ఇచ్చేసి అలంకరణ పూర్తి చేయమనండి. ముగ్గుల్లో రంగులు, పూలను నింపమనొచ్చు. ఈ సమయంలో ఆ చిన్ని బుర్రలకు బోలెడు అనుమానాలు వస్తాయి. ఓపిగ్గా చెబితే పండగ పరమార్థం తెలియజేసిన వారవుతారు.

కాగితాలతో.. కొన్ని రంగుల కాగితాలు ఇవ్వండి. చిన్న పూలు, ఆకుల్లా తయారు చేయమనండి. వాళ్లకి అవగాహన లేకపోతే యూట్యూబ్‌ సాయం తీసుకోనిస్తే సరి. వాటన్నింటినీ దండలుగా ఇల్లంతా వేలాడదీయడమో, అక్కడక్కడా గోడలకు అతికించడమో చేసినా ఆ గదంతా కళకళలాడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్