వంటగదిలో గార్డెనింగ్‌....

పుదీనా, అల్లం, మిర్చి.. ఇవి లేకపోతే వంటకి ఘుమఘుమలు ఎక్కడివి? ఫ్రిజ్‌లో ఉన్నాయిగా అంటారా? ఉన్నాసరే... ఇవి కుండీల్లో తేలిగ్గా పెరుగుతాయి. అప్పటికప్పుడు తుంచి వేస్తే ఆ తాజాదనపు ఘుమఘుమే వేరు.

Published : 22 Nov 2023 01:28 IST

పుదీనా, అల్లం, మిర్చి.. ఇవి లేకపోతే వంటకి ఘుమఘుమలు ఎక్కడివి? ఫ్రిజ్‌లో ఉన్నాయిగా అంటారా? ఉన్నాసరే... ఇవి కుండీల్లో తేలిగ్గా పెరుగుతాయి. అప్పటికప్పుడు తుంచి వేస్తే ఆ తాజాదనపు ఘుమఘుమే వేరు. ఇలా తేలిగ్గా పెంచేయండి... 

  •  కొత్తిమీర: ఇది వేస్తే ఏ కూరైనా అద్భుతమైన సువాసన రావాల్సిందే. మంచి రుచినీ అందిస్తుంది. ధనియాలని రాత్రంతా నీటిలో నానబెట్టి మరసటి రోజు చేత్తో నలిపి వేస్తే... రెండువారాలకి కొత్తిమీర మొలకలు వస్తాయి. వంటగదిలో ఎండ తగిలే చోట ఉంచితే సరి. గుబురుగా పెరుగుతుంది. అవసరానికి చారులో ఓ రెమ్మ వేసి చూడండి. వంటగది మొత్తం ఘుమాయించాల్సిందే.
  •  పుదీనా: బిర్యానీ, సలాడ్స్‌, టీలకి ప్రత్యేకమైన రుచిని తెచ్చే పుదీనాని తేలిగ్గా పెంచుకోవచ్చు. వీటి కాడలను మట్టిలో నాటితే చాలు. వేగంగా పెరుగుతాయి. వంటగదిలో వీటి సువాసన వ్యాపించి.. మీ ఒత్తిడీ మాయమవుతుంది.
  •  అల్లం: టీలో అయినా నాన్‌వెజ్‌ వంటకాల్లో అయినా తాజా అల్లం పడాల్సిందే. దీన్ని పెంచడం తేలికే. ముదురు అల్లం తీసుకుని దాన్ని కణుపు దగ్గర కత్తిరించి ఆ ముక్కను మట్టిలో నాటితే సరి. కొన్ని రోజులకి మొలకెత్తుతుంది. బాగా పెరిగాక... కావాల్సినంత అల్లం ముక్క తీసుకుని తక్కిన దాన్ని మట్టిలో ఉంచేయడమే.
  •  పచ్చిమిర్చి: వీటిని కూడా బాల్కనీ, వంటగదుల్లో తేలిగ్గా పెంచేయొచ్చు. పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. చిన్న కుండీల్లో కూడా పెరుగుతాయి. మట్టికి కాస్తంత పోషకాలు జోడిస్తే చెట్టు నిండా కాయలు కాస్తాయి. చారులోకో, పప్పులోకో.. అవసరానికి తాజాగా  వేసుకోవచ్చు.
  •  వెల్లుల్లి: ఉల్లిపాయల మాదిరిగానే పెరుగుతుంది. దీని రెబ్బలను మట్టిలో పాతిపెట్టి కుండీకి ఎండ తగిలేలా ఉంచితే చాలు.  జలుబు, ఫ్లూల నుంచి కాపాడే అద్భుత ఔషధం. తేలిగ్గా పెరుగుతుంది. అవసరానికి ఉపయోగపడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్