కొబ్బరిపీచు పారేస్తున్నారా!

కొబ్బరికాయలతోపాటే వచ్చే పీచుని.. పారేస్తున్నారా? దాని ప్రయోజనాలు తెలిస్తే మీరలా పారేయరు...

Published : 24 Nov 2023 01:18 IST

కొబ్బరికాయలతోపాటే వచ్చే పీచుని.. పారేస్తున్నారా? దాని ప్రయోజనాలు తెలిస్తే మీరలా పారేయరు...

  • పాత్రలు తోమడానికి స్టీల్‌ స్క్రబ్బర్‌ కన్నా కొబ్బరి పీచు సౌకర్యంగా ఉంటుంది. ప్లాస్టిక్‌ స్క్రబ్బర్‌తో పోలిస్తే పర్యావరణహితం కూడా. 
  • ఇత్తడి పాత్రలో కొబ్బరి పీచును పొట్టులా చేసి వేసి అందులో కొద్దిగా కర్పూరం వేసి మండిస్తే ఇంట్లో దుర్వాసనలు దూరమవుతాయి. దోమల బెడద కూడా ఉండదు.
  • నెరిసిన జుట్టుకు ఇది డైలా కూడా ఉపయోగపడుతుంది. ఒక పాత్రలో కొబ్బరి పీచు వేసి నల్లగా మారేంతవరకూ వేయించుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా పొడిగా చేసుకుని అందులో కొబ్బరి నూనె, ఆవ నూనె వేసి పేస్ట్‌లా చేసుకుని తలకు పట్టించుకోవాలి. ఆరాక కడిగేస్తే జుట్టు రంగు మారుతుంది.
  • కొంతమంది ఆర్థరైటిస్‌ కారణంగా బాధపడుతుంటారు. అలాంటి వారికి కొబ్బరి ఔషధంలా పనిచేస్తుంది. ఈ పీచుతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులను నయం చేస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్